మరీ ముఖ్యం గా సమంత ఐటెం సాంగ్ అయితే చిన్న పిలల్లు నుండి ముసలి వాళ్లు వరకు అందరూ ఎంజాయ్ చేస్తూ పాడుతున్నారు. ఇక ఈ మధ్యనే సోషల్ మీడియా లో ఓ వీడియో బాగా వైరల్ అయ్యింది . అందులో ఓ పాప WHO అని చదవకుండా "ఊ అంటావా మావ ఊ ఊ అంటావా మావా" అంటూ క్యూట్ క్యూట్ గా పాడుతుంది. ఇక ఈ వీడియో అటు తిరిగి ఇటు తిరిగి సమంత కంట పడడంతో ఆమె కూడా లవ్ సింబల్ తో రిప్లై ఇస్తూ వీడియోని షేర్ చేసింది. ఇక నాటు నాటు సాంగ్ గురించి అయితే చెప్పక్కర్లేదు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ చూసిన ఈ పాటనే కనిపిస్తుంది.
ఇక అఖండ సినిమాలో జై బాలయ్య సాంగ్ లో బాల కృష్ణ వేసిన ఆ షర్ట్ మార్చే స్టెప్ ఓ రేంజ్ లో వైరల్ అయ్యింది. ఇక ఆ స్టెప్ ని చాలా మంది నెటిజన్స్ ట్రై చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇక రీసెంట్ గా హీరోయిన్ నివేదా థామస్ కూడా ఈ జై బాలయ్య స్టెప్ ను ట్రై చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే మొదటి షర్ట్ మారేవరకూ బాగానే ఉన్నా ఆ తరువాత సీన్ రివర్స్ అయింది. ఇక ఈ వీడియోను షేర్ చేస్తూ నివేదా 'ఏదేమైనా అఖండ ఎక్స్‌పీరియెన్స్ అదిరిపోయింది' అని క్యాప్షన్ పెట్టి పోస్ట్ చేసింది. ఇక దీని పై బాలయ్య ఫ్యాన్స్ ఫన్నీ గా రిప్లై ఇస్తూ బాలయ్య స్టెప్పులతో అంత వీజీ కాదు నివేదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి