సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే నేషనల్ క్రష్ గా గుర్తింపు సంపాదించింది రష్మిక మందన. తన కోర చూపులతో తన అందం అభినయంతో యూత్ అందరిని ఆకర్షించి ఎంతగానో గుర్తింపు సంపాదించి. ఇక చిత్ర పరిశ్రమలో ఈ అమ్మడికి అదృష్టం కూడా బాగా కలిసి వచ్చింది. పట్టుకున్నదల్లా బంగారం అయినట్లు.. ఈ అమ్మడు చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. దీంతో మొదటి సినిమా నుంచి ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోకుండా  దూసుకుపోయింది రష్మిక మందన్న. ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.



 ఇక ప్రస్తుతం దాదాపు స్టార్ హీరోలందరి సినిమాల్లో కూడా నటిస్తూ అంతకంతకు క్రేజ్ సంపాదించుకుంటుంది ఈ అమ్మడు.  ఇక ఎక్కడ ఎప్పుడు కనిపించినా ఎంతో చలాకీగా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోతూ ఉంటుంది. కేవలం సినిమాల్లో మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా అభిమానులను ఎప్పటికప్పుడు అలరిస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇటీవల కాలంలో కాస్త హాట్ నెస్ పెంచింది అనే చెప్పాలి. హాట్ హాట్ ఫోటో షూట్లతో ఏకంగా సోషల్ మీడియాని ఊపేస్తోంది రష్మిక మందన. ముఖ్యంగా కుర్రాళ్ళలు తన హాట్ నెస్ తో నిద్ర లేకుండా చేస్తుంది అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు రష్మిక మందన పోస్టు చేసిన ఒక ఫోటో కుర్రకారు మతి పోగొడుతుంది. కేవలం ఫోటో మాత్రమే కాదు ఈ ఫోటోకి రష్మిక మందన ఇచ్చిన ట్యాగ్ లైన్  కూడా అందరినీ ఆకర్షిస్తోంది. డిమ్ లైట్ లో ఒక మత్తెక్కించే యాంగిల్ లో దిగిన ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రష్మిక మందన. వేరు వేరు భంగిమలు ట్రై చేస్తున్నాను. ఈ భంగిమ ఎలా ఉంది వర్కౌట్ అయిందా అంటూ ఒక టాగ్ లైన్ కూడా రాసుకొచ్చింది. ఈ ఫోటో నెటిజన్లను తెగ ఆకర్షిస్తుంది అని చెప్పాలి. దీంతో ఎంతో మంది అభిమానులు భిన్నమైన కామెంట్లు పెడుతూనే ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: