జక్కన్న సినిమాలు అంటే జనాల్లో ఒక పెద్ద ఆలోచన ఉంటుంది. ఆయన సినిమాలు చాలా లేట్ గా వచ్చినా సూపర్ హిట్ అవ్వడంతో పాటుగా, బాక్సాఫీస్ రికార్డు లను తిరగరాస్తాయి. అందుకే అంత క్రేజ్ వుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో రాజమౌలి పేరుకు మంచి పేరు వుంది. బాహుబలి లాంటి సినిమాలను ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రజలకు అందించారు. ఆ సినిమాలో నటించిన నటీనటులు మంచి పేరును అందుకున్నారు. ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తున్నారు. అందుకే జక్కన్న సినిమాలో నటించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు...


ప్రస్తుతం రాజమౌలి తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా.. ఈ సినిమాలో  రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తూన్నారు.. ఈ సినిమాకు సంబంధించిన అన్నీ కార్యక్రమాలను చిత్ర యూనిట్ పూర్తీ చేసింది.బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విఎఫ్‌ఎక్స్, కలర్ కరెక్షన్ వంటి అన్ని పనులు పూర్తవడంతో పాటు సెన్సార్ కూడా పూర్తయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మెరుగుపడి పూర్తీ స్థాయిలో పరిస్థితులు మెరుగు పడితే సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా విడుదల వాయిదా పడటం తో ఇప్పుడు మరో సినిమా పై దృష్టి పెట్టారు.


రాజమౌలి తండ్రి తో కలిసి మహేష్ తో సినిమా చేయాలనే ఆలోచన లో వున్నట్లు తెలుస్తుంది.మహేష్ బాబుతో ఎటువంటి చిత్రమైతే బాగుంటుందనే విషయంపై ఇప్పటికే వీరిరువురు చర్చలు సాగిస్తున్నట్లు గా సమాచారం. ప్రస్తుతానికైతే ఇండియానా జోన్స్ తరహాలో అడవి నేపథ్యం లో అడ్వంచర్ సినిమాను చెయాలనె ఆలోచనలో వీళ్ళు వున్నట్లు తెలుస్తుంది. కుదిరితే ఈ సంవత్సరం పూర్తయ్యే లోపు ఈ చిత్రానికి సంబంధించిన కథను సిద్ధం చేయాలని, వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో స్ర్కీన్‌ప్లే వర్క్ పూర్తి చేసి వెంటనే విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందె..


మరింత సమాచారం తెలుసుకోండి: