తెలుగు సినిమా చరిత్రలో కొన్ని కాంబినేషన్ లు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అది హీరో - డైరెక్టర్, ప్రొడ్యూసర్ - డైరెక్టర్, హీరో - హీరోయిన్ ఇలా కలిసి వచ్చిన కాంబో ఏదైనా కావొచ్చు. అదే విధంగా ఒక కాంబినేషన్ గురించి ఇండస్ట్రీ అంతా కోడై కూస్తోంది. మరి ఆ కాంబో ఎవరో చూద్దామా... నటరత్న నందమూరి బాలకృష్ణ మరియు ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను లది. టాలీవుడ్ లో ఈ ఇద్దరికీ ప్రత్యేకమైన స్థానం ఉంది ఇది ఎవ్వరూకాదనలేని సత్యం. కట్ చేస్తే వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు మూడు సినిమాలు సింహ, లెజెండ్ మరియు అఖండ లు తెరకెక్కగా, అన్నీ కూడా ఇండస్ట్రీ హిట్లు గా నిలిచాయి వీరిద్దరి కాంబో కు ఉన్న శక్తి ఏమిటో తెలియచేశాయి.

డిసెంబర్ లో విడుదలయిన ఈ సినిమా అర్ధ శతదినోత్సవాన్ని పూర్తి చేసుకుని శతదినోత్సవం దిశగా పరుగులు తీస్తోంది, మొదటగా ఈ సినిమాను కేవలం తెలుగు భాషలో మాత్రమే రిలీజ్ చేశారు. కానీ రోజు రోజుకీ వస్తున్న ఆదరణ మూలాన ఇప్పుడు ఈ సినిమా యూనిట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాను నాలుగు భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. ప్రస్తుతానికి తమిళ్ లో రిలీజ్ కు సిద్ధమైంది. రేపు తమిళ్ భారీగా ఈ సినిమా రిలీజ్ కానుంది. త్వరలోనే హిందీ, మలయాళం మరియు కన్నడ భాషల్లోనూ రిలీజ్ కానుంది. మరి అక్కడ కూడా ఇదే స్థాయిలో వసూళ్లు సాధించి రికార్డులను క్రియేట్ చేస్తుందా చూడాలి.

గత కొద్ది రోజుల క్రితం ఓ టి టి లో రిలీజ్ కాగా అక్కడ కూడా అఖండ తన సత్తాను చూపుతోంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్య జైస్వాల్ నటించగా, శ్రీకాంత్, పూర్ణ పలువురు తమ పాత్ర పరిధి మేరకు నటించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: