టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు వరుసగా పాన్ ఇండియా బాట పడుతున్న విషయం అందరికీ తెలిసిందే.అయితే ఒక్కసారి పాన్ ఇండియా రూట్ లోకి వెళితే మళ్ళీ ఎవరు కూడా మరో ఆలోచన చేయడం లేదు. అసలు విషయంలోకి వెళ్తే  రానున్న రోజుల్లో రామ్ చరణ్ కూడా మరిన్ని పాన్ ఇండియా సినిమాలను చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇటీవల రామ్ చరణ్ హఠాత్తుగా ముంబైలో కనిపించడంతో కొత్త సినిమా ప్రాజెక్ట్ కోసమే అని సోషల్ మీడియాలో టాక్ వస్తోంది. అయితే రామ్ చరణ్ rrr సినిమాతో మొదటి సారి పాన్ ఇండియా మార్కెట్ ను ఎన్టీఆర్ తో షేర్ చేసుకుంటున్నాడు..

ఇక  ఆ తరువాత మాత్రం సోలోగానే వరుసగా బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్టులను లైన్ లో పెట్టాలని చూస్తున్నాడట రామ్ చరణ్. అయితే రామ్ చరణ్ వీలైనంతవరకు పవర్ఫుల్ కథలను సెట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు  సమాచారం.అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా రామ్ చరణ్ విభిన్నమైన దర్శకులను కూడా ట్రాక్ లోకి తీసుకు వస్తున్నాడు. తెలుగు సినిమా దర్శకులు కాకుండా ఇతర దర్శకులు కూడా రామ్ చరణ్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ఇక తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్  శంకర్ తో పాటు గౌతమ్ తిన్ననూరితో కూడా ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడట..

త్వరలోనే సంజయ్ లీలా భన్సాలీతో కూడా ఒక సినిమా చేసేందు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.  అయితే ఇటీవల రామ్ చరణ్ ముంబైకు వెళ్లి  ఒక స్టార్ దర్శకుడితో స్టార్ హోటల్ లో ప్రత్యేకంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఆ దర్శకుడు ఎవరో కాదు సంజయ్ లీలా భన్సాలి అని టాక్ వస్తోంది.అయితే పద్మావత్ సినిమాతో బిగ్ హిట్ అందుకున్న సంజయ్ ....త్వరలో గంగుభాయ్ ఖతియావాడి సినిమాను రిలీజ్ కు సిద్ధం చేశాడట. ఇక ఆ సినిమా అనంతరం రామ్ చరణ్ తో వర్క్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.  ఇక ఈ విషయం ఎంతవరకు నిజమో కాదో తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకు వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: