ఈ చర్చలు ఇప్పటికే రెండు సార్లు జరిగి ఒక నివేదికను తయారు చేయడం జరిగిందట. దీంతో ఇప్పుడు కొంతమంది బడా హీరోలు సైతం జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్తున్నారు. ఇక సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని.. ఏపీ సీఎం తో మీటింగ్ కు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. హైదరాబాదు నుంచి ఒక ప్రత్యేకమైన విమానంలో విజయవాడకు చేరుకున్నారు. సినిమా టికెట్ల వ్యవహారం తో పాటు సినీ పరిశ్రమలో ఉన్న కొన్ని సమస్యలను గురించి ఎంత మంది ప్రముఖులు ఏపీ సీఎంతో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినట్లు సమాచారం.
గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లను బాగా తగ్గించిన సంగతి అందరికీ తెలిసిందే.. దీంతో సినీ పరిశ్రమ అప్పటినుంచి ఇప్పటివరకు అసంతృప్తిగానే ఉన్నది. దీంతో కొంతమంది సినీ ప్రముఖులు సైతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం జరిగింది. అయితే మరికొంతమంది మాత్రం చర్చలు రూపంలో సమస్యలను పరిష్కరించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. గతా కొద్ది రోజుల క్రితం రాంగోపాల్ వర్మ కూడా ఏపీ ప్రభుత్వ పని తీరును విమర్శించారు. సినిమా టికెట్ల ధరలు తగ్గించడం ఇది సరైన పద్ధతి కాదు అని తెలియజేయడం జరిగింది. ఇక పేర్ని నాని తో స్వయంగా రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ తన అభిప్రాయాలను తెలుసుకున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి