తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేమ పెళ్ళిళ్ళు కామన్.. డేటింగ్ పేరుతో టైం వెస్ట్ చెయ్యరు. అయితే బాలివుడ్ మాత్రం అలా కాదు..పెళ్ళి అనేది ఎక్కడా లేదు.. ప్రేమ పేరు తో తిరగరు. నచ్చితే డేటింగ్ అంటారు.. పెళ్ళి మాట వస్తే మేము ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము అంటూ మాట మారుస్తారు. అలా చాలా జంటలు ఉన్నారు. అయితే కొన్ని జంటలు మాత్రం పెళ్ళి వరకూ వెళ్తున్నారు. విలక్షణ పాత్రల కు కేరాఫ్ అడ్రస్ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్. అతడు కొంత కాలంగా గాబ్రియెల్ల దెమిత్రియాడెస్‌తో డేటింగ్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే..


వీరిద్దరి డేటింగ్ కు గుర్థుగా ఒక కొడుకు కూడా వున్నారు. అతనికి ఆరిక్ అని పెట్టారు. జంటగా జీవిస్తున్నప్పటి కి తమకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని అర్జున్ తెలిపాడు. తమ బంధానికి ఎటువంటి స్టాంప్ అవసరం లేదని కూడా వెల్లడించాడు. తాజాగా ఈ విషయం గురించి అసలు విషయాన్ని బయట పెట్టారు.. అతను చెప్పిన విషయాలు అందరినీ ఆకర్షించింది. అంతేకాదు అందరినీ ఆలోచనలో పడేసింది..


గతంలో వారిద్దరికి పెళ్ళి కూడా అయ్యిందని చెప్పాడు. మాకు కాగితం తో ఎటువంటి అవసరం లేదు. మనసులు ఎప్పుడో పెళ్ళి చేసుకున్నాయి. బయట అందరికి చెప్పే పెళ్ళి మాకు వద్దు మా ఇద్దరికీ కూడా ఇలా కలిసి ఉండటం ఇష్టం అని చెప్పారు.పెళ్లి అనేది అందమైన విషయం అని గాబ్రియెల్ల చెప్పింది. వారి మధ్య ప్రేమ తక్కువగా ఉందని మనం చెప్పలేం. పెళ్లాడనప్పటి కి మా మధ్య బంధం చాలా గట్టిగా ఉంది. మాకు ఎవరి ధ్రువీకరణా అవసరం లేదు. పెళ్లి అనేది పెద్ద అంశమేం కాదు.. అందరి కన్నా ఎక్కువగా మేము సంతోషం గా ఉన్నామని వాళ్ళు చెప్పారు. పెళ్ళి మాకొద్దు అని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: