స్పైడర్ మ్యాన్.. ఈ సినిమా గురించి ప్రత్యెకంగా చెప్పనక్కర్లెదు. ఈ సినిమా విడుదల అన్నీ ఇండస్ట్రీ ల లో మంచి టాక్ ను అందుకుంది. ఆ సినిమా ఇప్పటికీ కూడా టీవీ లలో వస్తే మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమాను చూడటానికి పిల్లలు నుంచి పెద్దలు వరకూ అందరు ఆసక్తి చూస్తారు. ఆ సినిమా హీరో అంతగా ఫెమస్ అయ్యాడు. ఇప్పుడు క్రేజ్ ను అందించడానికి మరో సినిమాలో నటించారు..ఆ సినిమా కూడా భారీగా హిట్ టాక్ ను అందుకుంది. ఆ విషయాలను ఒకసారి చుద్దాము..


స్పైడర్ మ్యాన్ ఫేం టామ్ హాలండ్, మరో యాక్షన్ హీరో మార్క్ వాల్‌బర్గ్ నటించిన సినిమా 'అన్‌చార్టెడ్.. ఈ సినిమా ఈ వారం థియెటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమా ఒక వీడియో గేమ్ ఆధారంగా రూపొందించారు. ఫుల్ యాక్షన్ సన్నీవేశాలు ఉండటం తో అందరినీ బాగా ఆకట్టుకుంది. దాంతో సినిమా పై మరింత హైప్ నెలకొంది. ఆ సినిమా తర్వాత హీరో నటించిన భారీ సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరోలు ఇద్దరు ఒక నిధికి సంబంధించిన మ్యాప్ ను దొంగలించారు. ఆ నిధిని ఎలా సాధిస్తారు అనే లైన్ పై సినిమా వుంటుంది.


విషయాన్నికొస్తే.. నిజానికి వీడియో గేమ్‌లో నాథన్ డ్రేక్ క్యారెక్టర్ వయసు కొంచెం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ సినిమాలో నటించిన టామ్ హాలండ్‌కు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి.. భవిష్యత్తులో ఈ ఫ్రాంచైజీని మరింత ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంలో అతని పాత్రను హైలెట్ చేశారు. టామ్ కూడా ఈ పాత్రకు 100 శాతం న్యాయం చేశాడు. అందరూ కూడా ఎవరికీ వాళ్ళే అన్నట్లు నటించారు. యాక్షన్ సినిమాలు అంటే హాలివుడ్ కొదవ లేదు. ఇప్పుడు ఈ సినిమా కూడా అంతే విధంగా వుంది. మొత్తానికి మన హీరో కు మరో హిట్ పడింది..

మరింత సమాచారం తెలుసుకోండి: