పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే కథ వేరేలా ఉంటుంది. సినిమాలు ఎంత హిట్ అవుతాయో ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు.అంతే క్రేజ్ తో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా భీమ్లానాయక్.. ఫిబ్రవరి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు హీరోలుగా నటించగా, నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. తెలంగాణాలో మొదటి రోజు నుంచే మొదటి షో తో మంచి టాక్ ను అందుకుంది..


కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియుమ్" సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు మాటలు, స్క్రీన్ ప్లే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఒక పాట తెగ వినిపించింది.అదే అంత కష్టం..అనే పాటను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ సాంగ్ నిత్యామీనన్, పవన్ కళ్యాణ్ మధ్య సాగే డ్యూయెట్ ఈ పాట. విడుదలైన కాసేపట్లోనే చార్ట్ బస్టర్ గా మారిన ఈ పాట యూట్యూబ్లో 2 కోట్లకి పైగా వ్యూస్ మరియు నాలుగు లక్షలకు పైగా లైక్స్ అందుకుంది. కానీ ఈ పాట సినిమాలో లేదు..


ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. భీమ్లా నాయక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సినిమాను ఆదరించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మేము అంత ఇష్టం పాటని షూట్ చేయలేదు. అది సినిమాలో సెట్ కాదని మాకు ముందే తెలుసు" అని చెప్పుకొచ్చారు సాగర్ కే చంద్ర చెప్పారు. ఇకపోతే ఏపి లో సినిమాకు చుక్కెదురు అయ్యింది. ఏపి సర్కార్ కక్ష్య తోనే ఇలా చెసిందని విమర్శలు చెస్తున్నారు.. మొత్తానికి ఈ సినిమా మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లోకి చేరింది.భీమ్లానాయక్.. టీమ్ ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: