ఇక ఈ చిత్రానికి నిర్మాతలుగా తేజ్ నారాయణ, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి, పల్లవి జ్యోతి కూడా నిర్మాణంలో భాగస్తులు అయ్యారు. ఈ చిత్రం ఈనెల 11వ తేదీన విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. బడ్జెట్ పరంగా చూసుకుంటే ఇది చాలా చిన్న సినిమా అని చెప్పవచ్చు. అయితే ఈ చిత్రాన్ని చూడటానికి ముంబైలోని థియేటర్లు సరిపోవడం లేదట. అందుచేతనే ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు థియేటర్ల సంఖ్య పెంచుకుంటూ వెళుతున్నారు చిత్రబృందం.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కోసం కపిల్ శర్మ అడగగా ఆయన తన టాక్ షోలో ఈ చిత్రానికి సంబంధించి టీమ్ ఎంట్రీ ఒప్పుకోలేదని డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి విమర్శించడం జరిగింది. ఇక ఆయన అలా చెప్పడానికి ముఖ్య కారణం తన సినిమాలో నటించినవారు ఎవరు స్టార్లు కాకపోవడమే అని ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజెన్స్ ఇలాంటి మంచి సినిమాని ప్రమోషన్ సహకరించరా? అంటూ అతని పై ఫైర్ అవుతున్నారు.అలా ఈ గొడవ చాలా పెద్దది అవుతూ ఉండడం జరిగింది. అయితే అనుపమ్ ఖేర్ జోక్ చేసుకొని ఈ సినిమాలో ఎలాంటి రాజకీయాలు లేవని ఆయన తెలియజేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్లకు కపిల్ శర్మని అడగ్గా ఆయన ఏం చెప్పాడంటే ఈ సినిమా చాలా సీరియస్ గా సాగుతోంది.. ఇలాంటి సందేశాత్మక చిత్రాన్ని.. కామెడీ షో లో మాట్లాడడం కరెక్ట్ కాదని తెలియజేశారట.