మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఒక రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దీంతో అతనికి తీవ్రంగా గాయాలు అవ్వడం జరిగింది. మాదాపూర్ లో దుర్గం చెరువు దగ్గర బైక్పై స్పీడుగా వెళుతుంటే సాయి ధరంతేజ్.. అనుకోకుండా ప్రమాదం బారిన పడ్డాడు. దీంతో ఈ హీరో ని మొదట మెడికవర్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు.. కానీ ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం అపోలో హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ఇక ఈ హీరో అలా హాస్పిటల్లో ఉండగానే తన నటించిన రిపబ్లిక్ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది..

ఆస్పత్రిలో సుమారుగా నెలకు పైగా చికిత్స పొందారు. ఆ తరువాత అక్టోబర్ నెలలో డిఛార్జ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకున్న తర్వాత ఇంటివద్దనే చికిత్స చేయించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చేస్తూ పలకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఒక వీడియోని విడుదల చేసి అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేశాడు మెగాహీరో. యాక్సిడెంట్ తర్వాత తనని ఆసుపత్రిలో చేర్పించి న వ్యక్తికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు తేజ్.. అదే విధంగా తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ని కూడా పంచుకోవడం జరిగింది.
ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారుతుంది.

తనకి యాక్సిడెంట్ జరిగినప్పుడు తనని ఆసుపత్రిలో చేర్పించినా వ్యక్తికి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. ఇక వాటితో పాటే మెడికవర్, అపోలో వైద్యుల సిబ్బందికి, తన కుటుంబ సభ్యులకు, తన మేనమామలు చిరంజీవి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. వారందరూ చూపించిన ప్రేమతోనే తను ఈరోజు ఇలా క్షేమంగా ఉన్నానని తెలిపారు. ఇక అభిమానుల కోసం ఈనెల 28వ తేదీన ఒక కొత్త సినిమాని ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. ఇక ఈ చిత్రానికి నిర్మాతలుగా సుకుమార్, బాబి వ్యవహరిస్తున్నారట. ప్రతి ఒక్కరూ బైక్పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి అంటూ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: