దీనికికారణం రామ్ చరణ్ లేటెస్ట్ గా ముంబాయ్ వెళ్ళి అక్కడ బాంద్రా లోని ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రదర్శింప బడుతున్న గైటీ ధియేటర్ లోకి వెళ్ళి అక్కడ ఆసినిమాను చూస్తున్న వారందరికీ ఊహించని విధంగా షాక్ ఇచ్చాడు. అనుకోకుండా వచ్చిన రామ్ చరణ్ ను చూసి ఆసమయంలో ‘ఆర్ ఆర్ ఆర్’ చూస్తున్న ప్రేక్షకులు అంతా రామ్ చరణ్ చుట్టూ చేరి అతడితో సెల్ఫీలు తీసుకోవడానికి పోటీ పడ్డారట.
ఆవిషయానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈఫోటోలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల దృష్టికి రావడంతో వారి అభిప్రాయాలు వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాను ముంబాయ్ లో ప్రమోట్ చేయడం మంచిది అయినప్పటికీ అక్కడ చరణ్ తో కలిసి జూనియర్ ఎందుకు లేడు అంటూ తారక్ అభిమానులు మదనపడుతున్నారు. ఇప్పటికే ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో చరణ్ కు వచ్చినంత ఎలివేషన్ తమ హీరోకి రాలేదు అంటూ బాధపడుతున్న తారక్ అభిమానులు ఇప్పుడు ముంబాయ్ లో చరణ్ పక్కన జూనియర్ కనిపించకపోవడం తారక్ అభిమానులకు పెద్దగా నచ్చలేదు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
వాస్తవానికి గతంలో చరణ్ నటించిన ‘జంగీర్’ మూవీ ఫెయిల్ అయినప్పటికీ చరణ్ నిరుత్సాహ పడకుండా ముంబాయిలో తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన పీ ఆర్ టీమ్ ను తానే సొంతంగా పెట్టుకున్నాడు అన్న వార్తలు కూడ గతంలో వచ్చాయి. అయితే జూనియర్ మాత్రం ‘ఆర్ ఆర్ ఆర్’ లాంటి భారీ సినిమాలో నటించినప్పటికీ ‘ఆర్ ఆర్ ఆర్’ ను ఉత్తరాదిలో ముఖ్యంగా ముంబాయ్ లో ప్రమోట్ చేస్తున్నప్పుడు చరణ్ ప్రమోట్ చేసినంతగా జూనియర్ ఇప్పుడు కనిపించకపోవడం ఎందువలనా అంటూ జూనియర్ అభిమానులు తెగ ఆలోచనలు చేస్తున్నట్లు టాక్..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి