ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలలో మోస్ట్ హ్యాండ్సమ్ ఎవరు అంటే ప్రతి ప్రేక్షకుడి నుంచి ఒకే పేరు వినిపిస్తుంది. అదే సూపర్ స్టార్ మహేష్ బాబు అని. సూపర్ స్టార్ మహేష్ బాబుఏజ్ పెరుగుతుందని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. కానీ ఎందుకు దేవుడు మాత్రం మహేష్ బాబు  విషయంలో వయసు పెంచడాన్ని మర్చిపోయాడేమో అనిపిస్తూ ఉంటుంది ఆయనను చూస్తూ ఉంటే. 40 ఏళ్ళ వయస్సు దాటి పోతుంటే సీనియర్ హీరోగా కనిపించాల్సింది పోయి సినిమా సినిమాకి యువకుడిగా మారిపోతున్నాడు మహేష్ బాబు.


 ప్రతి సినిమాలో మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తూ అమ్మాయిల మనసులు కొల్లగొడుతున్నాడు. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా మారిన తరువాత కూడా మహేష్ ఎలాంటి తేడా లేదు అని చెప్పాడు. అందుకేఇప్పటికీ లేడీ ఫ్యాన్స్ అందరు మహేష్ బాబు పేరు వినిపిస్తే చాలు మెలికలు తిరిగి పోతూ ఉంటారు. కేవలం అభిమానులు మాత్రమే కాదండోయ్ అటు హీరోయిన్లు సైతం మహేష్ బాబు అందానికి ఫిదా అవుతుంటారు.


 ఈ క్రమంలోనే ప్రస్తుతం మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న మేజర్ సినిమా హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆలీతో సరదాగా అనే కార్యక్రమం లోకి వచ్చింది సాయి మంజ్రేకర్. మహేష్ బాబును కలవగానే  మీరు ఏమనుకున్నారు..  మీ నెక్స్ట్ సినిమాలో నన్ను హీరోయిన్గా పెట్టాలని అడిగారా అంటూ ప్రశ్నించాడు వ్యాఖ్యాత అలీ. లేదు మహేష్ బాబు సర్ ని కలవగానే ఆయన అందానికి ఫిదా అయిపోయా అని.. ఆయన అందానికి సీక్రెట్ ఏంటో చెప్పాలని అడిగాను అంటూ చెప్పుకొచ్చింది. ఆయన రోజురోజుకీ మరింత యంగ్ గా మారిపోతున్నాడు అంటూ తెలిపింది. ఈ విషయం తెలిసి ఎవరైనా మహేష్ బాబు అందానికి ఫిదా అవ్వాల్సిందే అంటూ అనుకుంటున్నారు అభిమానులు..

మరింత సమాచారం తెలుసుకోండి: