ప్రస్తుతం ఎఫ్ 3 (F3) చిత్రయూనిట్ ప్రమోషన్లలో బిజీ గా ఉన్న విషయం తెలిసిందే విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు.


శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణ లో శిరీష్ నిర్మిస్తున్నారట.ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ మే 27న థియేటర్లలో విడుద ల కాబోతుందని తెలుస్తుంది. ఎఫ్ 3 సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో చిత్రయూనిట్ ప్రమోషన్లలో కూడా వేగం పెంచింది. వరుస ఇంటర్వ్యూలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారట.అయితే ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా నటిస్తుండగా.. సోనాల్ చౌహన్ కీలకపాత్రలో నటిస్తోందని సమాచారం. అయితే ముందు నుంచి సోనాల్ పోషించే పాత్ర ఏంటీ అన్నది మేకర్స్ మాత్రం అస్సలు బయటపెట్టలేదు.. ఇక విషయాన్ని సినిమా ప్రమోషన్లో అడిగిన దర్శకుడు మాత్రం చెప్పననే అంటున్నారట.. తాజాగా మరోసారి సోనాల్ చౌహన్ పాత్ర గురించి స్పందించాడట డైరెక్టర్ అనిల్ రావిపూడి.


తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న అనిల్ రావిపూడి కి సోనాల్ పాత్రకు సంబంధించిన ప్రశ్న ఎదురైందట. డైరెక్టర్ స్పందిస్తూ.. ” తమన్నా.. మెహ్రీన్ వంటి బ్యూటిస్ ఉన్నప్పటికీ సోనాల్ ను ఎందుకు సెలెక్ట్ చేసామని మాత్రం అడగొద్దు.. ఆమె పాత్రకు సంబంధించినంతవరకూ ఒక సర్ ప్రైజ్ ఉందని అందువలన ఆ విషయాలను రివీల్ చేయదలచుకోలేదని చెప్పాడు.అలాగే పూజా హెగ్డే పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అవుతుందని. ఫలక్ నుమా ప్యాలెస్ లో ఎక్కువ రోజులు షూటింగ్ జరుపుకున్న సినిమా కూడా మాదే.. ఈ సినిమాలోనూ నేను చివర్లో కనిపిస్తానని ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పా్న్స్ చూసి ఎఫ్ 4 తప్పకుండా ఉంటుంది.. ” అంటూ చెప్పుకొచ్చారట అనిల్ రావిపూడి...మరి చూడాలి f3 సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను నవ్విస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: