గత కొన్ని రోజులుగా కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ తో తీయబోతున్న మూవీలో ఒక కీలక పాత్రకు రాజశేఖర్ ఎంపిక అయ్యాడు అంటూ వార్తల హడావిడి చేసారు. ఈ వార్తల పై క్లారిటీ కోసం రాజశేఖర్ ను సంప్రదిస్తే ఆయన స్పందన చాల వైవిద్యంగా ఉంది. తాను కూడ ఈ వార్తలను సోషల్ మీడియాలో చూస్తున్నానని ఆ వార్తలు నిజం అయి తనకు కొరటాల శివ నుండి పిలుపు వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాను అంటూ తాను కొరటాల శివ మూవీలో నటించడానికి రెడీ అన్న సంకేతాలు ఇస్తున్నాడు.


ఇదే సందర్భంలో తన భవిష్యత్ సినిమాల గురించి మాట్లాడుతూ తాను పరాజయాల గురించి భయపడే వ్యక్తిని కాదని అలాంటి పరాజయాలు తనకు ఎందుకు వచ్చాయి అన్న విశ్లేషణ చేసుకుంటానని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు తనను ప్రేక్షకులు ఎక్కువగా పోలీసు పాత్రలో చూడటానికి అలవాటు పడటంతో మరొక పాత్రలో తనను చూడలేకపోతున్నారా అన్న సందేహాలు కూడ తనకు ఉన్నాయి అంటున్నాడు.


ఈమధ్యకాలంలో తనకు హిట్ ఇచ్చిన ‘గరుడవేగ’ మూవీ సీక్వెల్ కోసం తాను ఆలోచిస్తున్నానని భవిష్యత్ లో ఆ మూవీని నిర్మించే ఆలోచన తనకు ఉంది అంటున్నాడు. వాస్తవానికి రాజశేఖర్ రాజీపడి క్యారెక్టర్ యాక్టర్ విలన్ గా నటిస్తాను అని లీకులు ఇస్తున్నప్పటికీ టాప్ దర్శకులు ఎవరు పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది.


గతంలో అమితాబ్ తీవ్రమైన ఆర్ధిక నష్టాలలో ఉన్నప్పుడు తన రూట్ మార్చుకుని బుల్లితెర పై ‘కౌన్ బనేగా కరోర్ పతి’ షోతో మళ్ళీ తన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇప్పుడు రాజశేఖర్ కూడ ఆలోచించి ఏదైనా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తే మళ్ళీ అతడికి మంచి రోజులు వచ్చే ఆస్కారం ఉంది. 90 సినిమాలకు పైగా నటించిన రాజశేఖర్ కు ప్రస్తుతం అతడు నటించే సినిమాలకు నిర్మాతలు దర్శకులు ధియేటర్లు దొరకకపోవడం అత్యంత దురదృష్టకరం అనుకోవాలి..  




మరింత సమాచారం తెలుసుకోండి: