షోలో బాలయ్య ఎనర్జీకి అందరూ ఫిదా అయ్యారు. అయితే ఈ షో అయిపోయాక, మళ్లీ సీజన్ 2 కోసం డిమాండ్ పెరిగింది. అభిమానులు బాలయ్య టాక్ షోను ఏ రేంజ్‌లో ఎంజాయ్ చేశారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.ఆహా ఓటీటీ నిర్వాహకులు కూడా అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఉండబోతుందని చెబుతూ వస్తున్నారు. అయితే రీసెంట్‌గా బాలయ్య ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండియన్ ఐడల్ షోకు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఈ క్రమంలో యాంకర్ అన్‌స్టాపబుల్ సీజన్ 2 గురించి ఓ ప్రశ్న అడిగాడట. ఈ షో ఎప్పుడు మొదలు కాబోతుందని యాంకర్ అడిగిన ప్రశ్నకు 'మధుర క్షణాలకు ముగింపు ఉండదు… కొనసాగింపే అంటూ బాలయ్య బదులు ఇచ్చాడు.
అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఖచ్చితంగా ఉంటుందని.. దానికి కూడా బాలయ్యే హోస్ట్‌గా ఉంటాడనేది కన్ఫం అయ్యింది. అయితే ఈ టాక్ షోను అతి త్వరలో ప్రారంభించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లుగా కుదిరితే, దసరా పర్వదినాన ఈ టాక్ షోను స్టార్ట్ చేస్తారని.. అంతేగాక ఈ టాక్ షో తొలి ఎపిసోడ్‌కు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని నిర్వాహకులు అంటున్నారు. మరి నిజంగా ఈ టాక్ షోకు చిరు వస్తారా లేదా అన్నది మాత్రం కొద్ది రోజుల్లో తెలియనుంది..గొపిచంద్ మలినెని తో ఓ సినిమా చేయనున్నారు.. ఇటీవల ఆ చిత్రం నుంచి బయటకు వచ్చిన వీడియో అందరిని అకట్టుకుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి