ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి అంచనాలు కలిగి ఉన్న సినిమ లలో విరాట పర్వం సినిమా ఒకటి. విరాట పర్వం సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా, అనేక కారణాల వల్ల అనేక సార్లు ఈ మూవీ విడుదల వాయిదా పడుతూ వచ్చింది. చాలా సార్లు విడుదల వాయిదా పడిన విరాట పర్వం సినిమా చివరకు జూన్ 17 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల కాబోతుంది.

దగ్గుబాటి రానా హీరోగా నటించిన విరాట పర్వం మూవీ లో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా , ప్రియమణి ఒక కీలక పాత్రలో నటించింది. ఈ వేణు వేణు ఉడుగుల దర్శకత్వం వహించగా సురేష్ బొబ్బిలి ఈ మూవీ కి సంగీతాన్ని సమర్పించాడు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం తాజాగా టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించడం మాత్రమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలు కూడా మరింతగా పెంచేలా చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా విరాట పర్వం చిత్ర బృందం ఈ సినిమా రన్ టైమ్ ను లాక్ చేసింది. విరాట పర్వం మూవీ 2 గంటల 31 నిమిషాల రన్ టైమ్ తో  ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలాగే ఈ మూవీ కి సెన్సార్ బోర్డు సభ్యుల నుండి యూ/ఎ సర్టిఫికెట్ లభించింది.  ఈ మూవీ ని దర్శకుడు వేణు ఉడుగుల నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాడు.  మరి ఇప్పటికే భీమ్లా నాయక్ మూవీ విజయంతో మంచి జోష్ లో ఉన్న రానా 'విరాట పర్వం' మూవీ తో ఎలాంటి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: