‘పక్కా కమర్షియల్’ ఫెయిల్ అయినప్పటికీ దర్శకుడు మారుతి ప్రభాస్ తో తాను తీయబోయే హార్రర్ కామెడీ మూవీ స్క్రిప్ట్ కు ఫైనల్ టచ్ ఇస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ మూవీ గురించి లీకులు ఇలా బయటకు రావడంతో ప్రభాస్ అభిమానులు విపరీతంగా భయపదిపోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ప్రభాస్ కు మొహమాటం ఎక్కువా అన్న మాటలు ఇండస్ట్రీలో చాలామంది చెపుతూ ఉంటారు.


ఎవరైనా ఒకటికి పదిసార్లు బలవంత పెడితే వారిని కాదనలేని మనస్తత్వం ప్రభాస్ ది అని అంటారు. ఇప్పుడు ఆ మనస్తత్వమే మారుతికి వరంగా మారుతుందా అన్న భయం అభిమానులకు ఏర్పడినట్లు సంకేతాలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈమూవీ ప్రాజెక్ట్ కు ప్రభాస్ తో ఓకె అనిపించుకోవడానికి మారుతి ఒక మాష్టర్ ప్లాన్ వేసాడు అంటూ సోషల్ మీడియాలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.


ఇప్పటివరకు అనుష్క ప్రభాస్ లు కలిసి నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ ను మారుతి ప్రభాస్ పై ప్రయోగించి అతడి అంగీకారం పొందడానికి ప్రయత్నిస్తున్నాడు అన్న గాసిప్పులు వస్తున్నాయి. మారుతి వ్రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం ఈ హార్రర్ మూవీలో ఒక కీలక పాత్ర ఉన్నట్లు టాక్. ఆ పాత్రను అనుష్క తో చేయించాలని మారుతి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.


గత మూడు సంవత్సరాలుగా అనుష్క ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. ఎవరైనా దర్శకుడు ఆమెకు కథ చెపుదామని ప్రయత్నిస్తే ఆమె కథ వినడానికి కూడ ఇంటర్వ్యూ ఇవ్వడం లేదు అని అంటారు. దీనితో అనుష్క ఎందుకు ఈ అజ్ఞాతవాసం చేస్తోంది అంటూ అనేక కథనాలు వినిపిస్తున్నాయి. నవీన్ పోలి శెట్టి తో అనుష్క నటించే సినిమా విషయమై కూడ క్లారిటీ లేదు. ఇలాంటి పరిస్థితులలో మారుతి ఆలోచన మేరకు ప్రభాస్ అనుష్క తో నటించడానికి ఒప్పుకుంటే ఆమె వెంటనే ఓకె అంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు..  


మరింత సమాచారం తెలుసుకోండి: