అగ్ర డైరెక్టర్ గా పేరు పొందిన దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ పీరియాడికల్ చిత్రం పొన్నియన్ సెల్వన్ . ఈ సినిమా కోసం అభిమానులు సైతం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మణిరత్నం రూపొందిచి న ఎన్నో సినిమాలు సైతం మంచి విజయాలను అందుకున్నాయి ఇప్పటికి ప్రేక్షకుల మనసులో కొన్ని చిత్రాలు నిలిచి ఉంటాయని చెప్పవచ్చు. ఎంతో కాలం తర్వాత మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వన్ సినిమాలో విక్రమ్, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిష తదితరులు ఈ సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ పనులు కూడా చాలా వేగవంతం చేశారు చిత్ర బృందం.


ప్రతిరోజు కూడా ఏదో ఒక అప్డేట్ విడుదల చేస్తూ ఈ సినిమా పైన మరింత హైప్ ని పెంచేస్తున్నారు. ఇప్పటికే కార్తీ, త్రిష, విక్రమ్ వంటి వారి  పోస్టర్ను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా బాలీవుడ్ హీరోయిన్ అయినా ఐశ్వర్యరాయ్ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్లో ఐశ్వర్యరాయ్ మరింత అందంగా కనిపిస్తోందని చెప్పవచ్చు. ప్రతీకారం తీర్చుకునే రాణి నందిని పాత్రలో ఐశ్వర్యారాయ్ కనిపించనుంది. పట్టుచీర పోడవాటి జుట్టు, మెడలో ఆభరణాలతో చూపుతిప్పని అందంతో ప్రేక్షకులను మరింత మంత్రముగ్ధులను చేస్తోంది.


పజాపూరు రాణి నందిని గా ఎంతో అందంగా చూపించారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 30 వ తేదీన తమిళ, తెలుగు మలయాళం అన్ని భాషలలో ఒకేసారి థియేటర్లు విడుదలవుతోంది ఈ చిత్రం. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని నటుల పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చిందని. ఇక ఇందులో ముఖ్యమైన పాత్రలు లక్ష్మీ శరత్ కుమార్ విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ్ల వంటి వారు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించడం జరుగుతోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారుతొంది..

మరింత సమాచారం తెలుసుకోండి: