రాజమౌళి తరువాత వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి కొరటాల శివ. మృదుస్వభావిగా పేరుగాంచిన కొరటాల కమ్యూనిజం భావజాలంతో ఉండే కొరటాల పూజలు పెద్దగా నమ్మకం పెట్టుకోదు. అవకాశం దొరికినప్పుడు తన భార్యతో కలిసి రామకృష్ణ మిషన్ కు వెళ్ళి ధ్యానం చేస్తుంటాడు.


తమకు పిల్లలు పుడితే సమాజానికి పెద్దగా సేవ చేయలేము అన్న ఉద్దేశ్యంతో 10 మంది అనాధ పిల్లలను దత్తత తీసుకుని వారికి చదువు చెప్పిస్తున్నాడు. అలాంటి కొరటాలకు ఊహించని కష్టాలను ఇచ్చింది. వాస్తవానికి ‘ఆచార్య’ మూవీని నిర్మించింది కొరటాల కాదు కొరటాల మిత్రులు. అయితే ఈమూవీ బిజినెస్ జరిగే విషయంలో కొరటాల తాను ఈమూవీకి ఎటువంటి నష్టాలు వచ్చినా సద్దుబాటు చేస్తానని అన్న చిన్న మాట కొరటాలను కార్నర్ చేసింది అన్నమాటలు వినిపిస్తున్నాయి.


‘ఆచార్య’ భంకరమైన ఫ్లాప్ గా మారడంతో ఆమూవీ బయ్యర్లకు తాము పెట్టిన పెట్టుబడిలో కనీసం పావు వంతు కూడ రాలేదు అన్న ప్రచారం ఉంది. దీనితో నష్టపోయిన బయ్యర్లు అందరు కొరటాల ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఉంటే కొరటాలకు మనశ్శాంతి లేకపోవడంతో కోట్లాది రూపాయలలో తన సొంత ఆస్థులు అమ్మి ‘ఆచార్య’ మూవీ బయ్యర్లకు సెటిల్ చేయవలసి వచ్చింది అని అంటారు. దీనికితోడు ఈ సెటిల్మెంట్ పూర్తి అయ్యేవరకు కొరటాల జూనియర్ తో సినిమా మొదలుపెట్టలేని స్థితి వచ్చింది అని అంటారు.


చాలామంది ఫిలిం ఇండస్ట్రీ వ్యక్తులులాగ కోర్టుల చుట్టూ తిరిగే ఓపికలేక తన కెరియర్ ను దృష్టిలో పెట్టుకుని తన ఆస్థులను అమ్మి కొరటాల ‘ఆచార్య’ నష్టాల నుండి బయటపడ్డాడు అని టాక్. వాస్తవానికి ‘ఆచార్య’ మూవీతో కొరటాల తనకు అత్యంత భారీగా లాభాలు వస్తాయని భావించాడు. అయితే సీన్ రివర్స్ కావడంతో అనవసరపు కష్టాలను కొరటాల కొని తెచ్చుకున్నాడు అంటూ ఇండస్ట్రీలో కొందరు కొరటాల పై సానుభూతి చూపెడుతున్నారు. ఏది ఎలా ఉన్నా మళ్ళీ కొరటాల ట్రాక్ లోకి రావాలని అతడి అభిమానులు ఆశిస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: