కళ్యాణ్ రామ్ హీరోగా.. డైరెక్టర్ మల్లిడి విశిష్ట దర్శకత్వంలో వస్తున్న బింబీ సార చిత్రం త్వరలోనే థియేటర్లలోకి విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు ఇక ఈ సినిమా పైన కళ్యాణ్ రామ్ అభిమానులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు.అయితే ఈ సినిమా సీక్వెలైన బింబిసార -2 సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు చాలా వైరల్ గా మారుతున్నాయి అయితే కళ్యాణ్ రామ్ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడం జరిగింది.


బింబిసార -2  సినిమాలో ఎన్టీఆర్ నటించిన క్లారిటీ ఇచ్చారు అందరు లాగా నేను చందమామ కథలను వింటూ చదువుతూ పెరిగానని తెలియజేశారు కళ్యాణ్ రామ్. ఇలాంటి నేపథ్యంలో వచ్చిన సినిమాలను చూసి తను చాలా ఆనందపడే వారిని తెలిపారు. ఇక తను కలలు కంటున్న సినిమాలో నటించే అవకాశం రావడంతో చాలా ఆనందపడ్డారని తెలియజేశారు అంతేకాకుండా ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ వశిష్టకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రొడ్యూసర్ హరి ఈ సినిమాకు నిర్మాణ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడలేదని కళ్యాణ్ రామ్ తెలియజేయడం జరిగింది.



విజువల్ ఎఫెక్ట్ తో ఈ సినిమాని ఒక రేంజ్ లో రూపొందించారని తెలియజేశారు కళ్యాణ్ రామ్ అద్భుతమైన టెక్నీషియన్లు ఈ సినిమాకి పనిచేయడం జరిగింది అని తెలిపారు బింబిసార  సినిమా రెండు భాగాలలో చెప్పాలని ముందే అనుకున్నామని కళ్యాణ్ రామ్ వెల్లడించడం జరిగింది. అయితే ఈ చిత్రానికి ఒకటి కంటే ఎక్కువ సీక్వెల్ చేయాలనుకుంటున్నట్లుగా తెలిపారు. అయితే బింబిసార  టీజర్ రిలీజ్ అయిన సమయంలో కొంతమంది మగధీర, బాహుబలి  సినిమాతో పోల్చారని కళ్యాణ్ రామ్ తెలిపారు. అయితే ఇలాంటి గొప్ప సినిమాలతో పోల్చడం తనకు చాలా సంతోషంగా ఉందని కూడా తెలిపారు తెలుగు వాళ్లకు ఉన్న ఏకైక ఎంటర్టైన్మెంట్ సినిమాని అని తెలిపారు కళ్యాణ్ రామ్.

మరింత సమాచారం తెలుసుకోండి: