నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ తన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నా అటు బాలయ్య సినిమాలకు ఉండే క్రేజ్ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకం అని చెప్పాలి. బాలయ్య సినిమా వస్తుందంటే చాలు మాస్ ప్రేక్షకులు అందరూ కూడా పూనకాలు వచ్చినట్లు ఊగి పోతూ ఉంటారు అని చెప్పాలి. బాలయ్య చెప్పే పంచ్ డైలాగులతో ప్రతి ఒక్కరికి గూస్బంప్స్ వస్తాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నందమూరి బాలకృష్ణ. అయితే ఇప్పటి వరకు నందమూరి బాలకృష్ణ బాగా నటించగలడు యాక్షన్ సన్నివేశాలలో ఇరగదియ్యగలడు అని మాత్రమే అందరికీ తెలుసు.. కానీ ఎవరూ ఊహించని విధంగా unstoppable అనే కార్యక్రమంతో హోస్ట్ గా అవతారమెత్తాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఆహా ఓటీటీ వేదికగా ఒక షో హోస్టింగ్ చేస్తూ ఎంతో మంది సెలబ్రిటీలను పిలవడం వారిని ఆసక్తికర ప్రశ్నలు అడగడం చేసేవాడు. ఈ క్రమంలోనే బాలయ్య unstoppable  సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన ఎంతో మంది సినీ సెలబ్రిటీలు వారి పై వస్తున్న రూమర్లు గాసిప్ ల కు చెక్ పెట్టారు అని చెప్పాలి.


 unstoppable మొదటి సీజన్ ముగిసింది. ఈ క్రమంలోనే త్వరగా రెండవ సీజన్ ప్రారంభించాలని డిమాండ్లూ పెరిగి పోయాయి. అయితే unstoppable సీజన్ 2 కి సంబంధించిన అప్డేట్ ఆగష్టు 2వ వారంలో ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మొదటి సీజన్ కోసం ఒక్కో ఎపిసోడ్ కి బాలకృష్ణ 2.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. కానీ రెండవ సీజన్ కోసం మాత్రం బాలకృష్ణ రెమ్యూనరేషన్ మరింత పెంచాడు అన్నది తెలుస్తుంది. ఇక ఒక్కో ఎపిసోడ్ కి దాదాపు 5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ సీజన్ కి మొదటి గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక రెండవ సీజన్ కోసం అభిమానులు అందరిలో ఆసక్తి మరింత పెరిగిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: