తెలుగు సినిమా పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వాలని చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తుంది హీరోయిన్ జాన్వీ కపూర్. శ్రీదేవి కూతురుగా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతుంది. అక్కడ ఆమె చేసే సినిమాలు యువతను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.  మంచి అభినయం దానికి తోడు అందాల ప్రదర్శన కూడా ఉండడంతో ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగిందని చెప్పాలి.

తెలుగు లో కూడా ఎంతో క్రేజ్ ఉన్న జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కోసం ఎన్నో రోజుల నుంచి ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. తొందరగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చే సినిమా చేస్తే చూడాలని వారు కోరుకుంటున్నారు. అయితే ఎప్పటికప్పుడు దానిని వాయిదా వేస్తూ తన అభిమానులను నిరాశ పరుస్తూనే ఉంది జాహ్నవి కపూర్. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఓ సినిమా ద్వారా తెలుగులోకి ఆమె రాబోతుంది అని చెప్పారు. కానీ ఎందుకో అది వర్కౌట్ అవ్వలేదు. 

ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ నటించబోతుంది అని చెప్పారు. కానీ ఇప్పటిదాకా ఆ విషయమై ఏదీ కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. దాంతో జాన్వీ కపూర్ ఎప్పుడు తెలుగు సినిమా చేస్తుందా అని అభిమానులు ఎదురు చూడసాగారు. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని టాలీవుడ్ సినిమా పరిశ్రమ యొక్క ఎంట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకి కూడా అక్కడ సినిమా చేయాలని ఆసక్తి ఉందని మంచి కథ వస్తే తప్పకుండా చేస్తానని ఈ ముగ్గురు వెల్లడించింది. ఇకపోతే అదే ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోలైన విజయ్ దేవరకొండ మరియు ఎన్టీఆర్ ల గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది జాన్వి కపూర్. ఎన్టీఆర్ లెజెండ్ నటుడని విజయ్ దేవరకొండ గిఫ్ట్ నటుడు అని చెప్పి వారితో కలిసి నటించడానికి ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆమె వెల్లడించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: