కేవలం 50 మిలియన్ డాలర్లతో తెరకెక్కించిన హాలీవుడ్ మూవీ జోకర్. ఈ సినిమా 2019 అక్టోబర్ లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక కలెక్షన్ల పరంగా 1.074 బిలియన్లు సంపాదించింది అంటే మన ఇండియన్ రుపీస్ ప్రకారం రూ.8.5 వేల కోట్ల రూపాయలు వసూలు చేసింది అన్నమాట. జోకర్ సినిమా భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క దేశంలో కూడా మంచి విజయాన్ని అందుకుంది వరల్డ్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ జాబితాలలో కూడా నిలవడం గమనార్హం.


జోకర్ సినిమా లో నటించిన జోక్విన్ ఫినిక్స్ ఆస్కార్ అవార్డును కూడా దక్కించుకున్నారు అంతేకాకుండా మొత్తం 11 కేటగిరిలో జోకర్ సినిమా ఆస్కార్ అవార్డులకు నామినేషన్ దక్కించుకుంది.. ఇక అలా అవార్డులు రివార్డులు అందుకోవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కమర్షియల్ సినిమాల మంచి జోరు కొనసాగింది. అధికారికంగా ప్రకటించడం జరిగింది. జోకర్ సినిమా వచ్చినప్పుడు నుండి ఈ సినిమా సీక్వెల్ గురించి బాగా ప్రచారం జరిగింది కానీ చిత్రగుందం మాత్రం జోకర్ -2 సినిమా గురించి మత్రం ఎలాంటి అధికారికంగా ప్రకటన ఇవ్వలేదు. కానీ తాజాగా మాత్రం జోకర్ -2 ను అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇక ఈ సినిమా యొక్క విడుదల తేదీని ప్రకటించడంతో అభిమానులు కాస్త ఆనందాన్ని తెలియజేస్తున్నారు.


జోకర్ మొదటి పార్టు 2019 అక్టోబర్ 4న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది ఇక జోకర్ -2 ను కూడా సరిగ్గా అదే తేదీన 5 సంవత్సరాల తర్వాత 2024 అక్టోబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలకు చాలా వేగంగా జరుగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. టాడ్ ఫిలిప్స్ డైరెక్షన్లో ఈ సినిమా సీక్వెల్ రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి జోకర్ -2 సినిమా విడుదలై ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: