టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం 'కార్తికేయ 2' ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ కూడా తెలిసిందే.ఇక ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. గతంలో వచ్చిన 'కార్తికేయ' మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి సూపర్ సక్సెస్ కావడంతో, కార్తికేయ-2 సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక హీరో నిఖిల్‌కు ఈ కార్తికేయ 2 చిత్రం అగ్నిపరీక్ష పెట్టబోతుందా అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు.ఇక గత కొంత కాలంగా కూడా నిఖిల్ సరైన సక్సెస్ లేక చాలా సతమతమవుతున్నాడు. ఈ యంగ్ హీరో చేసిన సినిమాల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. దీంతో ఇప్పుడు ఈ సినిమాతో భారీ బ్లాక్‌బస్టర్ హిట్ ని అందుకుని, తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని హీరో నిఖిల్ భావిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు పోటీగా బాక్సాఫీస్ దగ్గర మరో సినిమా కూడా వస్తుండటం.. ఇక ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా నెలకొనడంతో కార్తికేయ 2 చిత్రం ఖచ్చితంగా విజయం సాధించాల్సిన పరిస్థితి నెలకొంది.


ఇక ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్స్ ఇంకా అలాగే ట్రైలర్స్ ఇప్పటికే కార్తికేయ 2 సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అవ్వడంలో సహాయపడ్డాయి. ఈ సినిమాను మరోసారి మంచి మిస్టరీ సస్పెన్స్ కథతో దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తుండగా, ఇందులో అందాల భామ మలయాళం బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరి ఆగస్టు 13 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న కార్తికేయ-2 చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో అనేది చూడాలి.ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని జనాలు నిఖిల్ కి మద్ధతు తెలుపుతున్నారు. మరి ఈ సినిమా జనాల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: