ఇక రోజు రోజుకీ బాలీవుడ్ సినిమా ప్రేక్షకుడికి చాలా దూరమవుతుందా అంటే అవుననే అంటున్నారు మూవీ లవర్స్. ఎందుకంటే భారీ అంచనాలతో రిలీజ్ అయిన సినిమాలెన్నో కూడా బాక్సాఫీస్ ముందు చాలా దారుణంగా బొక్కబోర్లా పడుతున్నాయి.ఇక లేటెస్ట్ గా అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా ఇంకా అక్షయ్ కుమార్ రక్షా బంధన్ కూడా ఫ్లాప్ లిస్ట్ లో చేరి బాలీవుడ్ ఇండస్ట్రీకి షాకిచ్చాయి.ఈనెల 11 వ తేదీన బాలీవుడ్ నుంచి రెండు భారీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటేమో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా, రెండోది బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ నటించిన రక్షా బంధన్. ఇద్దరూ కూడా సూపర్ స్టార్ లే కావడంతో భారీ ఓపెనింగ్స్ ఉంటాయనుకున్నారంతా. కాని అత్యల్ప ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ ముందు ఇవి బాగా బ్లాస్ట్ అయిపోయాయి.ఫారెస్ట్ గంప్ సినిమాకి రీమేక్ గా వచ్చిన లాల్ సింగ్ చడ్డా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయింది.ఇక ఈ సినిమాను అద్వైత్ చందన్ తెరకెక్కించాడు. ఈ సినమాతో టాలీవుడ్ యంగ్ హీరో యువ సామ్రాట్ నాగచైతన్య బాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. కాని, ఈ సినిమా అయితే రిజల్ట్ చాలా పూర్ గా ఉంది. సినిమా మొత్తం ఫస్ట్ డే కలెక్షన్స్ కేవలం 12 కోట్లకే పరిమితమైంది.


అమీర్ ఖాన్ సినిమా అంటే చాలా భారీ ఓపెనింగ్స్ ఉంటాయి. అలాంటిది మన టాలీవుడ్ లో మిడ్ రేంజ్ హీరోకొచ్చే కలెక్షన్స్ వసూల్ చేసి, ఇంకా డివైడ్ టాక్ తో రన్ అవుతుండటంతో ఫ్లాప్ లిస్ట్ లో చేరిపోయింది.ఇక బాలీవుడ్ నుంచి మరో స్టార్ హీరో అయిన బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ ఫ్యామిలీ డ్రామా రక్షా బంధన్ కూడా అక్షయ్ కుమార్ నే కాదు,ఇంకా టోటల్ బాలీవుడ్ ఇండస్ట్రీనే నిరాశ పరిచింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఆయన పృథ్వీరాజ్ సినిమాకు వచ్చిన ఫస్ట్ డే కలెక్షన్స్ కన్నా కూడా తక్కువ కేవలం 9 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది.దాంతో బాలీవుడ్ స్టార్ హీరోలకే సక్సెస్ కొట్టడం చాలా సవాలుగా మారుతోంది. ఇలా స్టార్ హీరోలే వరుస ప్లాప్స్ ఇస్తుంటే ఇంకా బాలీవుడ్ కి భరోసా ఎవరిస్తారు, ఎప్పుడిస్తారు అని ఈ బాలీవుడ్ వర్గాలు తెగ మదనపడిపోతున్నారు.


ఇక ఈ భయంతో కరణ్ జోహార్ రన్బీర్ కపూర్ హీరోగా నిర్మిస్తున్న 'బ్రహ్మస్త్ర' సినిమా కోసం షారుక్ ఖాన్ ని రంగంలోకి దించుతున్నాడట. ఈ సినిమాలో షారుక్ ఖాన్ కామియో రోల్ ఉంటుందని సమాచారం. సినిమా హైప్ కోసమే ఇలా చేస్తున్నాడట కరణ్ జోహార్.

మరింత సమాచారం తెలుసుకోండి: