తెలుగు మరియు తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . కీర్తి సురేష్, రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన నేను శైలజ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది . నేను శైలజ మూవీ తో మంచి గుర్తింపు లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో   దక్కించుకున్న కీర్తి సురేష్ మహానటి మూవీ తో నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుంది . 

మహానటి తర్వాత కీర్తి సురేష్ అనేక లేడీ ఓరియెంటెడ్ మూవీ లలో నటించింది . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగు మరియు తమిళ భాషలలో వరుస మూవీ లలో నటిస్తూ ఫుల్ బిజీ గా తన కెరీర్ ని కొన సాగిస్తుంది . ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి హీరో గా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా మెహర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ లో చిరంజీవి కి చెల్లెలి పాత్రలో నటిస్తోంది. ఇలా వరుస మూవీ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న  కీర్తి సురేష్ అప్పు డప్పుడు సోషల్ మీడియాలో వేదికగా తన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ ముద్దు గుమ్మ తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా కీర్తి సురేష్ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో గ్రీన్ కలర్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం కీర్తి సురేష్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్  అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: