టాలీవుడ్ యంగ్ హీరో అయిన నాగ శౌర్య మంచి హిట్ సినిమా కొట్టి చాలా కాలం అయింది. ఈ క్రమంలోనే ఈయన హిట్ సినిమా కోసం ఎంతో శ్రమిస్తున్నారని చెప్పాలి.


ఈయన హీరోగా నటించిన లక్ష్య, వరుడు కావలెను వంటి సినిమాలు పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయి. అయితే తాజాగా ఈయన నటించిన కృష్ణ వ్రింద విహారి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా కూడా పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితాలను అయితే అందించలేకపోయింది.


ఇక ఈ సినిమాకు అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వం వహించగా ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మించారు. ఈ చిత్రంతో నాగశౌర్య కీర్తన నటి షిర్లీ సెటియా అనే న్యూజిలాండ్ బ్యూటీ టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయమయ్యారట..ఇక ఈ సినిమా మిశ్రమ స్పందన లభించుకున్నప్పటికీ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నాగశౌర్యసినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను అయితే తెలియజేశారు.


 


ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ ఈ సినిమాని పోలి అదుర్స్ అంటే సుందరానికి సినిమాలు కూడా ఇదే కథాంశంతో తెరకెక్కయాని అని అందరూ కూడా భావిస్తున్నారు. అయితే హీరోల పాత్ర ఒకే ఉన్నప్పటికీ కథాంశం ఎంతో విభిన్నంగా ఉంటుందని ఆ సినిమాలకు ఈ సినిమాకి ఏ విధమైనటువంటి పోలిక లేదని ఈయన తెలిపారు.ఇక ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఈ సినిమా కోసం దాదాపు మూడు సంవత్సరాలు కష్టపడ్డామని ఈ సందర్భంగా నాగశౌర్య వెల్లడించారట.


 


ఇకపోతే ఈ సినిమాలో సెకండ్ హాఫ్ తనకి ఎంతో అద్భుతంగా నచ్చిందని, ఈ సినిమాలో ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో ఎంటర్టైనింగ్ గా ఉంటుందని తెలిపారు. రొమాంటిక్ కామెడీ తరహాలో వచ్చిన ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరికి ఆకట్టుకుంటుందని ఈయన వెల్లడించారు. ఇకపోతే ఇంటర్వ్యూ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ తనకు రొమాంటిక్ సన్నివేశాలలో నటించడం అంతగా చేతకాదని అలాంటి సన్నివేశాలలో నటించడానికి ఎంతో అసౌకర్యంగా ఉంటానని,రొమాంటిక్ సీన్స్ లో తాను చాలా వీక్ అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: