వి.వి.వినాయక్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో మూడు సినిమాలు తెరకెక్కగా ఆ మూడు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి విజయం సాధించాయి. వినాయక్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఆది సినిమాతో దర్శకుడిగా వి.వి.వినాయక్ ప్రయాణం అయితే మొదలైంది.


పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన చాలా సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించి వినాయక్ కు స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు రావడానికి కారణమయ్యాయి.


ఆది తర్వాత ఈ కాంబినేషన్ లో సాంబ సినిమా తెరకెక్కగా కథ, కథనంలోని లోపాల వల్ల ఈ సినిమా కొంత యావరేజ్ రిజల్ట్ కు పరిమితమైంది. అయితే విద్య యొక్క గొప్పదనం గురించి చెబుతూ తెరకెక్కిన ఈ సినిమా తారక్ అభిమానులకు మాత్రం ఎంతగానో నచ్చింది. ఆ తర్వాత ఈ కాంబినేషన్ లో అదుర్స్ సినిమా తెరకెక్కగా ఆ సినిమా ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదుర్స్ సినిమా సీక్వెల్ కు సంబంధించి ఎన్నో వార్తలు కూడా ప్రచారంలో కి వచ్చాయి.


 


అయితే వినాయక్ తాజాగా అదుర్స్2 సినిమా లేనట్టేనని అన్నారు. ఇప్పటికే అదుర్స్2 కోసం రెండు కథలు అనుకున్నానని కానీ అవి సరిగ్గా అనిపించలేదని వినాయక్ కూడా తెలిపారు. అటు తారక్ కు ఇటు నాకు కెరీర్ పరంగా అదుర్స్ సినిమా మంచి పేరు ను తెచ్చిపెట్టిందని ఆ సినిమాను టచ్ చేయకుండా ఉంటే మంచిద ని అనిపిస్తోందని వినాయక్ చెప్పుకొచ్చారు.


 


అయితే వినాయక్ అదుర్స్2 సినిమా కు సంబంధించి రెండు కథలు తారక్ కు చెప్పినా తారక్ కు ఆ కథలు నచ్చలేదని అందువల్లే అదుర్స్2 ఆగిపోయిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం విశేషం..

మరింత సమాచారం తెలుసుకోండి: