బ్యూటీ కత్రినా కైఫ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈమె ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది. తమిళనాడులోని మధురైలో మౌంటెన్ వ్యూ స్కూల్ లో ఉన్న చిన్నపిల్లలతో కలిసి ఇటీవల సూపర్ హిట్ అయిన అరబిక్ ముతూ పాటకు కత్రినా కైఫ్ డాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోని ట్విట్టర్లో ఆదివారం కత్రినా కైఫ్ అభిమాని షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారుతుంది.

అంతేకాదు ఈ వీడియో కింద హార్ట్ , లవ్ స్ట్రక్ ఎమోజీలతో ఈ వీడియో సూపర్ అంటూ నెటిజన్ల సైతం కామెంట్లు చేస్తున్నారు . ఇదిలా ఉండగా ఈ వీడియోలో కత్రినా చాలా అందంగా ఉంది అని ఒక నెటిజన్  కామెంట్ చేయగా .. మరొక నేటిజన్ ఒక వైబ్ అని కూడా కామెంట్ చేశారు. ఇకపోతే కత్రినా కైఫ్ డాన్స్ చేస్తున్నప్పుడు ఎల్లప్పుడూ చూడదగినది అని మరొక నేటిజన్ కామెంట్ చేశారు.  కాగా వైరల్ వీడియోలో కత్రినా  పాఠశాల సిబ్బందితో కలిసి వేదికపై డాన్స్ చేస్తున్నట్లు ఉంది. ఇకపోతే నిరుపేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందించడానికి తమిళనాడులో ఉన్న మౌంటెన్ వ్యూ స్కూల్ 2015లో రిలీఫ్ ప్రాజెక్ట్ ఇండియాలో భాగంగా ప్రారంభించబడింది.


కత్రినా కైఫ్ తల్లి సుజానే చాలాకాలంగా ఈ పాఠశాల తో అనుబంధం ఏర్పాటు చేసుకున్నారు. ఇకపోతే 2020లో పాఠశాలలో తరగతి గదులను నిర్మించడానికి విరాళాలు ఇవ్వాలని ప్రజలు కూడా కత్రినా కైఫ్ ను కోరడం జరిగింది.. ఎక్కువమంది పిల్లలు వారి కళల నెరవేర్చడానికి మన వంతు కృషి చేద్దాము ఉన్న కష్ట సమయాలను పరిగణలోకి తీసుకుంటే .. ఒకరికొకరు ఉండడం మరింత ముఖ్యమంటూ ఆ సమయంలో కత్రినా కైఫ్ తెలిపింది. ముఖ్యంగా వివక్షత లేకుండా నాణ్యమైన విద్య కోసం కృషి చేయాలి అని , ఆడ శిశు హత్యలు, బాలిక విద్య వంటి అంశాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడా కత్రినా కైఫ్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: