టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు. ఇక వందశాతం తెలుగు కంటెంట్ తో దూసుకుపోతోన్న ఆహా అందిస్తున్న అన్ స్టాపబుల్ కు బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.అంతేకాదు తనదైన మాటలతో, సెన్సాఫ్ హ్యూమర్ తో బాలయ్య చేసిన సందడి అంతా ఇంత కాదు. బాలకృష్ణ టాక్ షో ఎలా చేస్తారు..? ల్లో తన నటనతో చెలరేగే సింహం గెస్ట్ లతో ఎలా సందడి చేశారు..? అనే ప్రశ్నలను పటాపంచలు చేస్తూ.. టాక్ షోలన్నింటిలోనూ అన్ స్టాపబులే నెంబర్ వన్ ఉండేలా నిలబెట్టారు బాలకృష్ణ. 

ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు, నేచురల్ స్టార్ నాని, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ మహారాజ రవితేజ ఇలా పలువురు స్టార్స్ తో తన మాటలతో.. సరదా సంభాషణలతో ఆకట్టుకున్నారు బాలకృష్ణ. మొదటి సీజన్ ను ఘనవిజయంగా పూర్తి చేసిన ఆహా. ఇక ఇప్పుడు సీజన్ 2 తో రావడానికి రెడీ అవుతోంది.అయితే ఇప్పటికే సీజన్ 2 గురించి అదిరిపోయే ఆప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకులను ఉరిస్తున్నారు ఆహా టీమ్. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.కాగా  ఈ షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఇక ఈ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే అన్ స్టాపబుల్ సీజన్ 2ను మొదలుపెట్టనున్నారు నటసింహం.

 ఇదిలా ఉంటె ఇటీవలే ఈ టాక్ షోకి సంబందించిన ఓ రాప్ సాంగ్ ను రిలీజ్ చేశారు.ఇక  అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు ఆహా టీమ్.అయితే ఈ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అన్ స్టాపబుల్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక దసరా కానుకగా అక్టోబర్ 4న విడుదల చేయనున్నారు. కాగా ఈ మేరకు ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ లో బాలయ్య కౌబోయ్ గెటప్ లో కనిపించరు.  సీజన్ 2లో చాలా మంది స్టార్ హీరోలు గెస్ట్ గా రానున్నారని తెలుస్తోంది.ఇకపోతే  అన్ స్టాపబుల్ సీజన్ 2 ఏ స్టార్ గెస్ట్ తో మొదలవుతుందో అని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: