దర్శకుల పై నాగార్జున పెట్టుకున్న నమ్మకం మరొకసారి నిలబడలేకపోయింది. దసరా రేసుకు విడుదలైన ‘ది ఘోస్ట్’ మూవీ సగటు ప్రేక్షకుడి అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోవడంతో ఆమూవీ నాగ్ కెరియర్ లో మరో ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది. వాస్తవానికి యంగ్ డైరెక్టర్స్ ను నాగార్జున నమ్మినంతగా మరో టాప్ హీరో ఎవరు నమ్మరు.

 

 నాగ్ కెరియర్ ను నిశితంగా పరిశీలిస్తే అతడి సూపర్ హిట్ సినిమాలు అన్నీ యంగ్ డైరెక్టర్స్ తీసినవే. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తిని పూర్తిగా నమ్మి నాగ్ ‘శివ’ లాంటి బ్లాక్ బష్టర్ మూవీలో నటించి మెప్పించాడు. ‘శివ’ లో సైకిల్ చైన్ తో ట్రెండ్ క్రియేట్ చేస్తే ‘ది ఘోస్ట్’ మూవీలో కత్తితో ట్రెండ్ క్రియేట్ చేయాలని దర్శకుడు ప్రవీణ్ సత్తార్ ను నమ్మి ‘ది ఘోస్ట్’ మూవీలో నటించాడు.

 

ప్రవీణ్ సత్తార్ నాగ్ ను చాల స్టైలిష్ గా చూపెట్టి మూవీని కూడ చాల స్టైలిష్ గా తీసినప్పటికీ జనం పట్టించుకోలేదు. దీనితో నాగార్జున దర్శకుల ఎంపికలో తప్పటడుగులు వేస్తున్నాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నాగార్జున గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించినప్పటికీ అతడితో సినిమాలు చేయడానికి టాప్ దర్శకులు ఎవరు ముందుకు రావడంలేదు.

 

 దీనితో ఇండస్ట్రీలో అందుబాటులో ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో ఎవరో ఒకర్ని ఎంపిక చేసుకుని ధైర్యం చేవలసిన పరిస్థితి నాగార్జునకు ఏర్పడింది. దీనికితోడు గతంలో నాగ్ సినిమాలకు మహిళల నుండి మంచి ఆదరణ ఉండేది. ఇప్పుడు గృహిణులు అంతా బుల్లితెరకు అతుక్కుపోయి సినిమాలకు వచ్చే పరిస్థితులలో లేరు. దీనికితోడు యూత్ లో కూడ నాగార్జున పట్ల ఆకర్షిణ తగ్గింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈవిధంగా రకరకాల కారణాలు వల్ల నాగార్జున తన దర్శకుల ఎంపికలో పొరపాటు చేయవలసి వస్తోంది అని అంటున్నారు. దీనితో త్వరలో ప్రారంభంకాబోయే నాగార్జున 100వ సినిమాకు దర్శకుడి ఎంపిక అంత సులువు కాదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  

 


మరింత సమాచారం తెలుసుకోండి: