లేడీ కమెడియన్ గీతా సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె పేరు వినగానే టక్కున గుర్తోచ్చే చిత్రం కితకితలు. ఈ సినిమాలో అల్లరి నరేశ్ సరసన హీరోయిన్‌గా నటించింది.
ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ఆమె మూవీ అప్పట్లో మంచి విజయం అయితే సాధించింది. ఈ చిత్రంతో గీతా సింగ్ రాత్రికి రాత్రే స్టార్‌డమ్ తెచ్చుకుంది. ఇందులో తన కామెడీతో కడుబ్బా నవ్వించడమే కాదు.. లావుగా ఉండే భార్య పడే కష్టాలను చూపించి అందరి చేత కన్నీరు పెట్టించింది. అలా ఎన్నో చిత్రాల్లో లేడీ కమెడియన్‌గా నటించి తెరపై ప్రేక్షకులను నవ్వించింది.
అయితే కొంతకాలంగా ఆమె తెరకు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన ఆమె జీవితంలో చోటు చేసుకున్న చేదు సంఘటనలను గుర్తు చేసుకుంది. అలాగే ఇండస్ట్రీలో అవకాశాలు రావడం లేదని, అందుకే తాను నటించడం లేదని చెప్పంది. పరిశ్రమలో అసలు సపోర్ట్ లేదంటూ గీతా సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది. ఇప్పుడసలు సినిమాల్లో ఫిమేల్ యాక్టర్స్ ఎక్కడ కనిపిస్తున్నారని, అందరు మేల్ యాక్టర్సే కదా అని వ్యాఖ్యానించింది. 'పరిశ్రమలో పురుషాధిక్యం ఎక్కువ. మహిళా నటులకు అసలు అవకాశాలు ఇవ్వడం లేదు. ఎంతమంది లేడీ కమెడియన్స్ లేరండి.. ఇప్పుడు ఎవరైనా ఏ సినిమాలో అయినా కనిపిస్తున్నారా?' అని చెప్పుకొచ్చిందట.
అనంతరం ఇటూ ఇండస్ట్రీ సపోర్ట్ లేక, నమ్ముకున్న బంధువుల మద్దుతు లేక ఒంటరిగా పోరాడుతున్నానంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. 'నమ్మిన వాళ్లే.. దారుణంగా మోసం చేశారు. డబ్బులు అవసరం ఉంటేనే నా కుటుంబానికి గుర్తుకు వస్తాను. నన్ను డబ్బు అవసరం కోసమే నాతో ఉండేవాళ్లు. సొంత చెల్లెల్లు కూడా నన్ను డబ్బుకోసం వాడుకున్నారు' అంటూ కన్నీటీ పర్యంతరం అయ్యిందట . ఇక ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి సంపాందిచుకున్న డబ్బును ఓ మనిషిని నమ్మి పోగొట్టుకున్నాని, ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ని నమ్మి ఆమె దగ్గర చిట్టీలు వేశానని చెప్పందట..
అయితే చివరకు ఆమె మోసం చేయడంతో సుమారు రూ. 6 కోట్ల వరకు నష్టపోయానని చెప్పుకొచ్చింది. ఇటూ ఆఫర్స్ లేక, చేసుకోడానికి పని లేక ఒత్తిడికి గురయ్యానని, బాధలో రెండుసార్లు ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశానంది. అయితే తన స్నేహితురాలు చూసి తనని కాపాడిందని తెలిపింది. ఇక ప్రస్తుతం తనకు ఆ స్నేహితురాలే పెద్ద దిక్కని, తన అన్నయ్య పిల్లలను దత్తత తీసుకుని వారితో కలిసి జీవిస్తున్నానంటూ గీతా సింగ్ చెప్పుకొచ్చిందట.. కాగా ఇటీవల జరిగిన మా ఎలక్షన్స్‌లో మంచు విష్ణు ప్యానెల్ తరపున పోటీ చేసి గెలుపు పొందిన విషయం తెలిసిందే
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి