స్టార్ హీరోయిన్ అయిన సమంత `మయోసైటిస్` అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సమంత నే స్వయంగా వెల్లడించింది

అలాగే చికిత్స పొందుతున్న ఫోటోలను సైతం ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. మయోసైటిస్ అనేది దీర్ఘకాలిక కండరాల వాపు. ఈ వ్యాధికి గురైన వారిలో తీవ్రమైన కండరాలు నొప్పి మరియు అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, చర్మంపై దద్దుర్లు ఏర్పడడం, నడవలేకపోవడం, ఎక్కువసేపు నిలబడి ఉండలేకపోవడం తదితర లక్షణాలన్నీ కూడా కనిపిస్తుంటాయి.

ప్రస్తుతం ఈ లక్షణాలను వదిలించుకుని మయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడటం కోసం సమంత విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇంటిపట్టునే ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే తాజాగా మయోసైటిస్ నుంచి బయటపడటం కోసం సమంత సంచలన నిర్ణయం అయితే తీసుకుందట. అది ఏంటంటే సమంత ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలని అయితే డిసైడ్ అయిందట. ఇప్పటికే చికిత్స కూడా ప్రారంభమైందట.

లోకల్ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర నుంచి సమంత ట్రీట్మెంట్ తీసుకుంటుందని నెట్టింట జోరుగా అయితే ప్రచారం జరుగుతుంది. మరి ఈ విధంగా అయినా సమంత మయోసైటిస్ వ్యాధి నుంచి పూర్తిగా కోరుకుంటుందా..? లేదా..? అన్నది మరి చూడాలి. కాగా, సినిమాల విషయానికి వస్తే సమంత రీసెంట్ గా `యశోద` అనే మూవీతో ప్రేక్షకులను పలకరించింది. హరి-హరీష్ ద్వయం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శివలెంక కృష్ణ ప్రసాద్‌ దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్తో నిర్మించారు.

నవంబర్ 11న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను అయితే రాబట్టి అఖండ విజయాన్ని అందుకుంది. ఇక సమంత మరోవైపు గుణశేఖర్ దర్శకత్వంలో `శాకుంతలం` అనే పౌరాణిక చిత్రాన్ని పూర్తి చేసింది. అలాగే రౌడీ బాయ్‌ విజయ్ దేవరకొండకు జోడిగా `ఖుషి` సినిమా చేస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ రెండూ పాన్ ఇండియా చిత్రాలే కావడం విశేషం. ఇక వీటితో పాటు మరిన్ని ప్రాజెక్ట్స్‌ ను సైతం సమంత చేతిలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: