మూడు దశాబ్దాల క్రితం మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ కలిసి నటిస్తే బాగుంటుంది అంటూ అప్పట్లో అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు భావించారు.

కానీ అది సాధ్యం కాలేదు.ముందు ముందు అయినా వారిద్దరు కలిసి నటిస్తారా అంటే ఆసాధ్యం అంటూ సినీ వర్గాల వారు మరియు వారి సన్నిహితులు చెబుతున్నారు.

వృత్తి పరంగా వారిద్దరూ పోటా పోటీ అన్నట్లుగా ఎప్పుడు నువ్వా నేనా అంటూ ఢీ కొడుతూ ఉంటారు.సాధారణంగా కార్యక్రమాల్లో సన్నిహిత్యం ఉంటూ చాలా మంచి స్నేహితులుగా కొనసాగినట్లు అనిపిస్తుంది.

కానీ సినిమాల విషయం వచ్చేప్పటికి ఇద్దరూ బద్ధ శత్రు వులు అన్నట్లుగా మారి పోతారు.ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ఎప్పటికప్పుడు తీవ్రంగా ప్రయత్నం చేస్తూనే ఉంటారు.

ఈ క్రమంలోనే వారిద్దరి కాంబినే షన్ సినిమా వస్తే కచ్చితంగా కథ విషయం లో చాలా ఇబ్బం దులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అసలు ఇద్దరి కీ నచ్చే కథ కచ్చితం గా రానే రాదు.మల్టీ స్టారర్ సినిమా అంటే ఏదో ఒక సమయం లో ఒక హీరో రాజీ పడాల్సి ఉంటుంది.కానీ వారిద్దరిలో ఏ ఒక్క హీరో కూడా రాజీ పడే అవకాశం లేనే లేదు.

కనుక వీరిద్దరి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమా వస్తుంది అనుకోవడం అవివేకం అవు తుంది.తాజాగా అన్ స్టాపబుల్‌ కార్యక్రమంలో బాలకృష్ణ అడిగిన ప్రశ్న కు చిరంజీవి మరియు మీతో కలిపి ఒక సినిమా ను చేస్తాను అంటూ అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఆ సమయం లో బానే స్పంది స్తూ అది పాన్ వరల్డ్ మూవీ అవు తుంది అంటూ ఎద్దేవా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

బాలయ్య మాటల తోనే మా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వర్కౌట్ అవ్వదు అన్నట్లుగా క్లారిటీ ఉంది అంటూ నెటిజన్స్ అభిప్రాయం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: