జేమ్స్ కామెరాన్ తాజాగా అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీకి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. చాలా సంవత్సరాల క్రితం అవతార్ మూవీ వచ్చి అద్భుతమైన విజయం ప్రపంచవ్యాప్తంగా సాధించడంతో అవతార్ 2 మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురు చూశారు. అలా భారీ అంచనాల నడుమ తెరకెక్కిన అవతార్ 2 మూవీ డిసెంబర్ 16 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. అందులో భాగంగా ఈ మూవీ డిసెంబర్ 16 వ తేదీనే తెలుగు భాషలో కూడా విడుదల అయింది.

మూవీ కి విడుదల అయిన మొదటి రోజు ... మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ లభించడంతో , ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు అవతార్ 2 మూవీ 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 7 రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మొదటి రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 13.65 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
2 వ రోజు 10.85 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.
3 వ రోజు 12.60 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
4 వ రోజు 5.15 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
5 వ రోజు 4.45 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
6 వ రోజు 3.90 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
7 వ రోజు 3.20 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.
మొత్తంగా 7 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో అవతార్ 2 మూవీ 53.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ప్రస్తుతం కూడా అవతార్ 2 మూ వీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్ లు లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: