13 ఏళ్ల క్రితం వచ్చిన 'అవతార్' చిత్రం ఎంత పెద్ద ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈ సినిమా రికార్డులు ఇంతవరకు కూడా ఏ సినిమా బద్దలు కొట్టలేదు. జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ ఇప్పటికీ చెక్కు చెదరని రికార్డుగా నిలిచింది. దీని రికార్డుని బ్రేక్ చెయ్యడానికి 13 ఏళ్ల తరువాత అవతార్ 2 వచ్చేసింది. టాక్ తో సంబంధం లేకుండా వసూళ్ళని కుమ్మేస్తుంది ఈ సినిమా. దానికి సీక్వెల్ గా వచ్చిన ఈ 'అవతార్ 2′(అవతార్ ది వే ఆఫ్ వాటర్)  రాబోతున్నట్టు ప్రకటన వచ్చినప్పటి నుండి సినిమా పై ఎన్నో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రపంచం మొత్తం ఎంతో ఆత్రంగా ఎదురుచూసిన ఈ సినిమా డిసెంబర్ 16 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా చాలా భారీ ఎత్తున చాలా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.దాదాపు 500 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ ఆడియన్స్ ను ఎంతగానో ఫిదా చేస్తుంది.


ఫస్ట్ డే కొంత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ జనం ఎగబడి ఈ చిత్రాన్ని చూస్తున్నారు.కొత్త సినిమాలు రిలీజ్ అయినా కూడా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దూకుడు ఏమాత్రం తగ్గలేదు. రెండో వీకెండ్ ను కూడా ఈ మూవీ చాలా బాగా క్యాష్ చేసుకుంది. ఒకసారి ఈ సినిమా 10 డేస్ కలెక్షన్స్ చూసినట్లయితే..'అవతార్ 2' (అవతార్ ది వే ఆఫ్ వాటర్) సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ.5 కోట్ల తక్కువ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇంకా చాలా ఏరియాల్లో రెంటల్ బేసిస్ మీద ఓన్ రిలీజ్ చేసుకున్నారు.దీంతో రూ.6 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించి ఇప్పుడు భారీ వసూళ్ళని సాధిస్తుంది.ఇక 10 రోజులు పూర్తయ్యేసరికి ఏకంగా రూ.55 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది.దీంతో బయ్యర్లకి ఈ సినిమా ఏకంగా రూ.50 కోట్ల భారీ లాభాలను అందించింది. 'ధమాకా' '18 పేజెస్' లాంటి పక్కా తెలుగు మూవీస్ రిలీజ్ అయినా కానీ ఈ మూవీ ఒక రేంజ్ లో కలెక్ట్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: