టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే వీరిద్దరి గురించి వీరి అభిమానులు సోషల్ మీడియాలో ఎంతలా రచ్చ చేస్తుంటారు మనందరికీ తెలిసిందే.సాధారణంగా హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ జరగడం సర్వసాధారణం. అయితే గతంలో థియేటర్స్ పంపకాల విషయంలో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం జరిగాయి అన్న వార్తలు గతంలో రావడం జరిగింది. ఇక ఒకేసారి అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో విడుదలయ్యాయి. దానికిగాను ఎవరి సినిమా హిట్ అవుతుంది అంటూ వారి అభిమానులు కొట్టుకున్నారు.

అయితే అప్పటినుండి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం జరిగాయి అన్న వార్తలు వచ్చాయి.  ఇక ఇటీవల గుణశేఖర్ కూతురు నీలిమ గుణ వివాహ రిసెప్షన్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు మహేష్ బాబు ఒకేసారి రావడం జరిగింది. ఇద్దరూ కలిసి రావడమే కాకుండా మహేష్ బాబు మరియు అల్లు అర్జున్ ఇద్దరు కలిసి దంపతులతో ఒకేసారి ఫోటో కూడా దిగారు. అయితే ఇద్దరూ కలిసి ఫోటో కూడా దిగినప్పటికీ వీరిద్దరూ మాట్లాడుకోలేదు అన్న వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి. ఇదిలా ఉంటే ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ నటిస్తున్న సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా నటిస్తుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే మహేష్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న సినిమాలో ఒక కీలక పాత్ర కోసం అల్లు అర్జున్ కూతురు అర్హ ని తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. దీంతో ఈ వార్త విన్న చాలా మంది వీరి అభిమానులు మహేష్ నటిస్తున్న సినిమాలో అల్లు అర్జున్ కూతురు నటిస్తే ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అన్న కామెంట్లు చేస్తున్నారు.ఇక ఇప్పటికే అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ సమంత నటించిన శాకుంతలం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా  నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. సమంత నటిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్హ ఒక కీలక పాత్ర పోషిస్తుంది అని సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: