అంతేకాకుండా ఈ కిల్లింగ్ లుక్స్ లో మైండ్ బ్లాక్ చేసే విధంగా ఈ ముద్దుగుమ్మ ఈ ఫోటోలలో కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఒక పోస్ట్ ఇలా చేస్తూ మీరు చేయగలరని నమ్మండి అక్కడే మీరు సగం విజయం అవుతారు.. సగం దూరం చేరుకుంటారు అంటూ తెలియజేస్తోంది. మన నమ్మకం ముఖ్యమని.. మనపై మనకు నమ్మకం ఉండాలనే విషయం గుర్తుంచుకోవాలని తెలియజేస్తోంది రకుల్ ప్రీతిసింగ్. ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. గత సంవత్సరం ఆరు సినిమాలను విడుదల చేయగా పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.ఇక ఈ ఏడాది ఛత్రివాలి అనే సినిమాలో మెయిన్ లీడ్ గా నటిస్తోంది. కండోమ్ ప్రయారిటీ సెక్స్ ఎడ్యుకేషన్ వివరించే ఈ చిత్రం ఈ నెల 20వ తేదీన ఓటీటి లో విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది రకుల్ ప్రీతిసింగ్. బాలీవుడ్ వెళ్ళాక ఈమె హవా మరింత పెరిగిపోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియాలో తన అందచందాలతో కుర్రకారును ప్రతిసారి మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. బాలీవుడ్ ప్రేక్షకులకు కావలసినంత గ్లామర్ ట్రీట్ ఇస్తూ నిరంతరం వార్తల్లోనే నిలుస్తూ ఉంటుంది రకుల్ ప్రీతిసింగ్. ప్రస్తుతం ఈమె కు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి