టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలు మరోవైపు వారు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.ఎన్నడూ లేని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్టులకు ఓకే చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఎన్నడూ లేని విధంగా పిరియాడిక్ జోనల్లో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఆ సినిమాని హరిహర వీరమల్లు. మొదటిసారి ఇలాంటి సినిమాలో నటించిన తో పాటు ఆయన కెరియర్ లోనే మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. 

క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఔరంగజేబుగా నటిస్తున్న బాబీ డియోల్ కు సంబంధించిన సీన్లను అక్కడ చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇదిలా ఉంటే ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన మరొక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట చిత్ర బృందం. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా దర్శకుడు క్రిష్ ఈ ఐడియాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చెప్పగా పవన్ కళ్యాణ్ కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోని ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ను కూడా చిత్ర బృందం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను ఏమేం రత్నం ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే మరొక వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించిన సంగతి మన అందరికీ తెలిసిందే.తాజాగా ఆ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా జరుపుకున్న నేపథ్యంలోనే వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ఈ సినిమా కూడా రెండు భాగాలుగా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: