టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే మెగాస్టార్ గా ఎదిగారు. ప్రస్తుతం యువ హీరోలకు దీటుగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అలాంటి ఈ సీనియర్ హీరో కేవలం సినిమాలోనే కాకుండా రాజకీయాల్లో కూడా రాణించాలని ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. 2009లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి పాలకొల్లు, తిరుపతి అసెంబ్లీ స్థానాల నుంచి మెగాస్టార్ చిరంజీవి పోటీ చేశారు. అయితే ఈయనకు రాజకీయాలు అంతగా అచ్చి రాలేదు. దాంతో పాలిటిక్స్ కి గుడ్ బై చెప్పి మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేశారు. 

ఇక అప్పట్లోనే మెగాస్టార్ కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఎంతలా సంపాదించారో అర్థం చేసుకోవచ్చు. అయితే అప్పట్లో మెగాస్టార్ తన సినిమాలతో వచ్చిన ఆదాయాన్ని ఎక్కువగా ఫామ్ హౌస్ లు, ఇల్లు కొనడానికి ఖర్చు చేసేవారట. ముఖ్యంగా ఈయన హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, వైజాగ్, విజయవాడ వంటి అగ్ర నగరాల్లో ఎన్నో ఇళ్లను, అలాగే స్థలాలను కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి ఆస్తి 1200 కోట్లకు పైగానే ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతారు. నిజానికి చిరంజీవికి ఇంతకంటే ఎక్కువనే ఆస్తి ఉండేదట. కానీ ఎప్పుడైతే ఆయన రాజకీయాల్లోకి వచ్చారో.. అప్పుడు చాలా వరకు కోట్లల్లో తన డబ్బులను కోల్పోయారట.

ఆయన గనక రాజకీయాల్లోకి వెళ్లకపోయి ఉంటే చిరంజీవి ఆస్తి ఇప్పుడు ఉన్న దాని కంటే రెండింతలు ఉండేదట. దీన్నిబట్టి రాజకీయాల్లో ఆయన భారీగానే డబ్బులు పోగొట్టుకున్నారని చెప్పొచ్చు. ఇక  చిరంజీవి వారసుడు అగ్ర హీరో రామ్ చరణ్ కి ఆయన ఆస్తులు ఆయనకే ఉన్నాయి. ఈ తండ్రి కొడుకులు ఇద్దరు ఇప్పటివరకు భారీగానే స్థిరా,చరాస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. ఇక  చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకి గాను చిరంజీవి ఏకంగా 40 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో 'బోలాశంకర్' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తమిళంలో అజిత్ నటించిన వేదాళం అనే హిట్ మూవీకి ఇది తెలుగు రీమేక్. వేసవి కానుకగా ఈ సినిమాని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: