రాబోతున్న ఆదివారం జరగబోతున్న ఆస్కార్ అవార్డుల ఫంక్షన్ లో ‘నాటు నాటు’ పాటకు అవార్డు రావాలని చరణ్ జూనియర్ అభిమానులు విపరీతంగా కోరుకుంటున్నారు. ఇప్పటికే అమెరికాలో ఉన్న రాజమౌళి ‘నాటు నాటు’ పాటకు మరింత హైక్ రావడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తూ ఈపాటలోని ప్రతి పదం వెనుక అర్థాన్ని వివరిస్తూ ఆ భావంలో అల్లూరి కొమరం భీమ్ ల పాత్రకు సంబంధించిన వివరణ ఉంటుంది అన్న విషయాన్ని హాలీవుడ్ మీడియాకు చాల తెలివిగా తెలియచేస్తున్నాడు.

 

 

ఈ క్రేజ్ ను కలక్షన్స్ రూపంలో మార్చుకోవడానికి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని ఈ వారంతంలో తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రముఖ నగరాలలో రీ రిలీజ్ చేస్తున్నారు. ఈమూవీలోని ‘నాటు నాటు’ పాటను మళ్ళీ చూడటానికి చరణ్ జూనియర్ అభిమానులు విపరీతంగా వస్తారని ఒక అంచనా. ఈ వారంలో మళ్ళీ చిన్న సినిమాల జాతర కొనసాగుతోంది. ఈ వారాంతం ఏకంగా 7 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ఇవన్నీ చిన్న సినిమాలే వీటిలో చెప్పుకోదగ్గ సినిమా మాత్రం ఒక్కటే ఆది సాయి కుమార్ నటించిన సీఎస్ఐ సనాతన్.

 

 

అయితే ఈసినిమా పై కూడ ఎటువంటి అంచనాలు లేవు. ప్రస్తుతం ఆది సినిమాలు ఈ సినిమాపై ఎప్పుడు వెళ్తున్నాయో కూడా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. దీనివల్ల సీఎస్ఐ సనాతన్ పై కూడా ఎలాంటి క్రేజ్ లేదు. ఇలాంటి పరిస్థితులలో రీ రిలీజ్ అవుతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ మళ్ళీ కలక్షన్స్ కొల్లగొట్టడం ఖాయం అని అనుకోవాలి. గత సంవత్సరం ఇదే మార్చి నెలలో ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలైంది. ఈమూవీ ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేయలేకపోయినా ఎవరు ఊహించని విధంగా ఆస్కార్ అవార్డుల ఫైనల్ లిస్టులోకి చేరి రాజమౌళి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేయడంతో తెలుగు వాడికి లభిస్తున్న ఈ గౌరవానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు అంతా ఆనందపడుతున్నారు...

 


మరింత సమాచారం తెలుసుకోండి: