ఎక్కువగా సాఫ్ట్ పాత్ర లో నటించిన మీనా అలనాటి స్టార్ హీరోలందరికీ జోడీగా నటించడంతో పాటు సక్సెస్ ను కూడా సొంతం చేసుకున్నారు.

మీనా తన భర్త చనిపోవడం వల్ల కొంతకాలం పాటు షూటింగ్ లకు దూరంగా వున్నారు.ఇప్పుడిప్పుడే షూటింగ్ లతో ఆమె బిజీ అవుతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మీనా మాట్లాడుతూ చెప్పిన విషయాలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన హృతిక్ రోషన్ అంటే తనకు చాలా ఇష్టం అని ఆమె కామెంట్ చేశారు. హృతిక్ రోషన్ పెళ్లిరోజున నా గుండె బద్దలైందని మీనా కామెంట్ చేశారు. తాను హృతిక్ రోషన్ లాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అయితే అనుకున్నానని మా అమ్మతో కూడా నేను అదే విషయాన్ని చెప్పానని మీనా తెలిపారు.. హృతిక్ రోషన్ ను నేను చాలా ప్రేమించానని ఆమె వెల్లడించడం విశేషం..

హృతిక్ రోషన్ పెళ్లి జరిగే సమయానికి నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదని హృతిక్ కు పెళ్లి జరిగిన రోజున నా హృదయం పగిలి పోయింది అని ఆమె చెప్పుకొచ్చారు.. హృతిక్ ను మీనా ఇంతలా అభిమానించేదని తెలిసి నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. మీనా లాంటి డై హార్డ్ ఫ్యాన్స్ ఉండటం అంటే హృతిక్ రోషన్ అదృష్టం అని కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు. మీనా అందంలో ఎలాంటి మార్పు రాలేదు. ఆమె అప్పుడు ఎంత అందంగా వుందో ఇప్పుడు కూడా అంతే అందంగా వుంది. మీనా స్మైల్ కి అందరూ పడి చచ్చిపోతారు. ఆమె అందానికి అందరూ కూడా తెగ ఫిదా అయ్యారు.సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మీనా వరుస సినిమాలతో బిజీ గా వుంది. మోహన్ లాల్ తో చేసిన దృశ్యం సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ సినిమా తెలుగులో కూడా రీమేక్ అయింది. ఇందులో కూడా మీనా వెంకటేష్ కి జోడిగా నటించింది. ఇక్కడ కూడా దృశ్యం సూపర్ హిట్ అయింది. ఆ తరువాత వచ్చిన దృశ్యం సీక్వల్ లో కూడా మీనా నటించింది. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: