
తన ఇంటి పని వాళ్లు డీటెయిల్స్ కూడా ఐశ్వర్య రజనీకాంత్ పోలీసులకు అందించినట్లు సమాచారం. వారిని కూడా విచారించి ఎవరు ఆ చోరీకి పాల్పడ్డారు అనే విషయాన్ని కనిపెట్టేలా చూస్తున్నారు పోలీసులు. అయితే తన ఇంట్లో పని చేస్తున్న సర్వెంట్స్ మీద ఐశ్వర్య నమ్మకం ఉన్నది.. వారు అలాంటి పని చేసి ఉంటారని తాను అనుకోవట్లేదని కాకపోతే వేరే వాళ్ళ మాటల వల్ల వారు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండవచ్చని పోలీసులకు తెలియజేసింది.
స్టార్స్ ఇంట్లో చోరీ జరిగితే ముందు ఆ ఇంట్లో పనిచేసే వారి మీదే మొదట అనుమానం వస్తూ ఉంటుంది పోలీసులకు.. అయితే ఆ తర్వాతే మిగిలిన వారి గురించి కుపి లాగుతూ ఉంటారు. ప్రస్తుతం ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న లాల్ సలాం సినిమా షూటింగ్ అవుట్ ఆఫ్ ది సిటీ లో ఎక్కువగా జరుగుతోంది. ఇమే ఇంట్లో లేనప్పుడు ఈ చోరీ జరిగిందని సమాచారం. కోల్పోయిన బంగారం విలువ దాదాపుగా మూడున్నర లక్షలకు దాకా ఉంటుందని తెలుస్తోంది. ఈ మధ్య తరచూ సెలబ్రిటీల ఇంటిలో ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని పోలీసులు తెలియజేస్తున్నారు.