సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎన్నో తెలియని విషయాలను కూడా తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆత్రుత పడుతున్నారు. అంతేకాకుండా కొంతమంది తమ టాలెంట్ను ప్రదర్శిస్తూ సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరి కొంతమంది మాత్రం వీటిని నీరుపయోగం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హీరో హీరోయిన్ల పైన పలు అసత్య ప్రచారం చేయడమే కాకుండా పలు రూమర్స్ కూడా సృష్టిస్తూ ఉంటారు. కొంతమంది నటీనటుల అనారోగ్యంపై కూడా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు.


అలా ఇప్పుడు తాజాగా సీనియర్ నటులలో ఒకరైన కోటా శ్రీనివాసరావు గారు గురించి పలు విషయాలు గడచిన కొద్ది రోజుల నుంచి వైరల్ గా మారుతున్నాయి.. దీనిపై కోటా శ్రీనివాసరావు గారు స్పందిస్తూ సోషల్ మీడియాలో నేను చనిపోయాను అంటూ ప్రచారం చేస్తున్నారంట.. అది చూసి ఉదయం నుంచి నాకు 50 కి పైగా ఫోన్ కాల్స్ వచ్చాయి. అన్నిటికంటే ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే.. పదిమంది పోలీసులు ఆ వార్త చూసి ఇంటికి రావడం జరిగింది. కోట శ్రీనివాసరావు గారు చనిపోయారు అంటే ప్రముఖులు వస్తారని సెక్యూరిటీ ఇద్దామని వచ్చినట్లుగా తెలియజేశారట.


ఉదయం లేవగానే ఉగాది పండుగ ఉన్న సమయంలో ఈ వార్త తనని చాలా బాధపెట్టిందంటూ తెలియజేశారు డబ్బు సంపాదించడానికి చాలా దారులు ఉన్నాయి కానీ ఇలా ఒక మనిషిని ప్రాణంతో ఉండగానే సంపాదించడం సరికాదు అంటూ ఇలాంటి విషయాల పైన పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ తెలియజేశారు. ప్రజలు కూడా ఇలాంటివి అసలు నమ్మవద్దని కూడా తెలియజేయడం జరిగింది నేను బ్రతికే ఉన్నాను అందరికీ ఉగాది శుభాకాంక్షలు అంటూ తెలియజేశారు కోటా శ్రీనివాసరావు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది. దీంతో ఎట్టకేలకు కోట శ్రీనివాసరావు షేర్ చేసిన ఈ వీడియోతో తనపై వచ్చిన రూమర్లకు క్లారిటీ పడిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: