టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోఒక రేంజ్ లో  ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరంటే అందరు పవన్ కళ్యాణ్ అనే చెప్తారు.ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ ఆయన చేసిన సేవ కార్యక్రమాలు ఆయన మీద ఉండే ఇష్టాన్ని డబల్ చేశాయని చెప్పాలి.

అడిగిన వాళ్లకి కాదనకుండా ఇచ్చేగుణం ఉన్నవాడు కాబట్టే ఇప్పుడు పాలిటిక్స్ లోకి కూడా వచ్చి ఇక్కడ కూడా తనదైన మార్క్ చూపిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ఇది ఇలా ఉంటె అప్పట్లో కరుణాకరన్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరో గా వచ్చిన బాలు సినిమా యావరేజ్ గా ఆడింది.అయితే ఆ సినిమా బాగున్నప్పటికీ అప్పట్లో పెద్దగా ఆడలేదు.ఇక ఇది ఇలా ఉంటె చాలా రోజుల తరువాత గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రవితేజ హీరోగా వచ్చిన బలుపు సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాకి కథ అందించింది బాబీ...అయితే బలుపు సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే రెండు కూడా బాలు సినిమా ని పోలి ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే రెండు సినిమాల్లో కూడా ఫ్లాష్ బ్యాక్ ఒకేలా ఉంటుంది అలాగే రెండు సినిమాల్లో హీరోయిన్ చనిపోతుంది.అయితే ఈ రెండు సినిమాల్లో బాలు సినిమా పెద్దగా ఆడలేదు కానీ బలుపు సినిమా మాత్రం మంచి విజయం సాధించింది.ఈ రెండు సినిమాల స్క్రీన్ ప్లే లు ఒకేలా ఉండటం లో రైటర్ కోన వెంకట్ హస్తం కూడా ఉందనే చెప్పాలి ఎందుకంటే బాలు సినిమా డైలాగ్ రైటర్ కోన వెంకట్ గారే అలాగే బలుపు సినిమాకి కూడా స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఆయనే రాసారు అందుకనే తెలియకుండానే స్క్రీన్ ప్లే లు రెండు కూడా ఒకేలా చేసి ఉంటారు అని ఈ విషయం తెలిసిన చాలా మంది అంటున్నారు.

కానీ ఆ రెండు సినిమాల్లో మెయిన్ డిఫరెన్స్ అనేది ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ వల్ల వచ్చిందే కానీ హీరోలు ఇద్దరు కూడా బాగా చేసారు అని నేటిజన్స్ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: