
2021 వ సంవత్సరం లో సంక్రాంతి లో విడుదలైన సినిమాల విషయానికి వస్తే రవితేజ నటించిన క్రాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు.ఈ సినిమా హిట్టుగా నిలిచింది. మళ్లీ ఈ ఏడాది దసరాకు టైగర్ నాగేశ్వరరావు సినిమాతో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని అభిషేక గర్వాల్ నిర్మాతగా వ్యవహ రిస్తున్నారు. ఈ సినిమా దసరా పండుగగా అక్టోబర్ 20న విడుదల కాబోతోంది.
ఇక సంక్రాంతికి వచ్చిన రామ్ పోతినేని రెడ్ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈసారి దసరాకు రామ్ బోయపాటి శ్రీను కలిసి వస్తున్నారు ప్రస్తుతానికి ఈ సినిమా టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు కానీ ఈ సినిమా అక్టోబర్ 20వ తేదీని విడుదల కాబోతున్నది.
ఇక గత సంవత్సరం తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజు దళపతి విజయ్ కాంబినేషన్లో వచ్చిన మాస్టర్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఈసారి దసరాకు ఈ కాంబో మరొకసారి రిపీట్ కాబోతోంది ఆచిత్రమే లియో ఈ సినిమా కూడా భారీ బడ్జెట్లో ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.
మరి ఏడాది సంక్రాంతికి వచ్చిన హీరోలు మళ్ళీ దసరాకి రావడానికి సిద్ధమవుతున్నారు మరి సినిమాల రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి.