తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయినటు వంటి దిల్ రాజు గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో డిస్ట్రిబ్యూటర్ గా ఎన్నో సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు ఆ తర్వాత సినిమాలకు నిర్మాతగా వ్యవహరించడం మొదలు పెట్టాడు. అందులో భాగంగా ఎన్నో సినిమాలను నిర్మించిన దిల్ రాజు ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బాస్టర్ నిర్మాతగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

దిల్ రాజు తన కెరియర్ లో ఎంతో మంది కొత్త దర్శకులకు ... కొత్త హీరోలకు ... కొత్త నటీ నటులకు ఛాన్స్ లు ఇచ్చి వారితో అద్భుతమైన విజయాలను అందుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అలాగే కొన్ని చిన్న చిన్న సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి వాటితో కూడా అద్భుతమైన లాభాలను అందుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా దిల్ రాజు ... నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన దసరా మూవీ యొక్క నైజాం హక్కులను 9 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఇలా ఈ మూవీ హక్కులను 9 కోట్లకు దిల్ రాజు కొనుగోలు చేయగా కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా 10 కోట్లకు మించి షేర్ కలక్షన్ లను నైజాం ఏరియాలో రాబట్టింది. దీనితో కేవలం రెండు రోజుల్లోనే నైజాం ఏరియాలో బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని లాభాలను అందుకుంటున్న ఈ సినిమా పూర్తి రన్ లో చాలా కలెక్షన్ లను వసూలు చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. దీనితో దసరా మూవీ తో దిల్ రాజు అదిరిపోయే రేంజ్ లాభాలను అందుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: