ఎంతో కాలం నుండి ఈ వార్త ప్రచారం లో ఉన్నప్పటికీ అటు అదితి రావు హయాద్రి కానీ సిద్దార్థ్ కానీ ఈ వార్తలపై ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు.కానీ వీళ్లిద్దరు కలిసి ప్రైవేట్ పార్టీలకు కూడా వెళ్లడం, కలిసి ఒకే ఇంట్లో ఉండడం వంటివి మనం గమనిస్తూనే ఉన్నాం.ఎన్నో వీడియోస్ లో వీళ్లిద్దరు అడ్డంగా కెమెరాకి చిక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి.అయితే సిద్దార్థ్ పుట్టిన రోజు సందర్భంగా అదితి రావు హయాద్రి విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
రోడ్డు మీద వీళ్ళద్దరు సరదాగా వేసిన పిచ్చి గంతులను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది అదితి రావు హయాద్రి.ఇద్దరికీ 40 ఏళ్ళ వయస్సు అయితే ఉంటుంది, ఇంకా చిన్న పిల్లల చేష్టలు పోలేదంటూ నెటిజెన్స్ కామెంట్స్ కూడా చేస్తున్నారు.గతం లో సిద్దార్థ్ శృతి హాసన్ మరియు సమంత వంటి స్టార్ హీరోయిన్స్ తో ప్రేమాయణం నడిపిన విషయం తెలిసిందే.
సమంత తో ప్రేమాయణం పెళ్లి పీటల వరకు అయితే వెళ్ళింది, కేవలం ఆమెని పెళ్లి చేసుకోవడం కోసం తన భార్య కి కూడా విడాకులు ఇచ్చేసాడు సిద్దార్థ్.కానీ చివరికి ఏమైందో ఏమో తెలియదు కానీ, వీళ్లిద్దరి పెళ్లి పెటాకులు అయ్యిందట..ఆ తర్వాత సమంత నాగ చైతన్య ని పెళ్లి చేసుకుంది, కొన్నాళ్ళకు విడిపోయి ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయింది.కానీ సిద్దార్థ్ మాత్రం అదితి రావు హయాద్రి తో ప్రేమలో పడ్డాడట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి