తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న వారిలో రష్మిక కూడా ఒకరు. ఇదే క్రేజ్ తో ఈ ముద్దుగుమ్మ ఇతర భాషలలో సైతం నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇక సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో చిట్ చాట్ కూడా నిర్వహిస్తూ ఉంటుంది రష్మిక. అయితే గత కొంతకాలంగా సైలెంట్ గా ఉండడం పై.. అభిమానులు ఆర తీయగా తాజాగా ఈ విషయం పైన సోషల్ మీడియా వేదికగా ఒక విషయాన్ని పోస్ట్ షేర్ చేయడం జరిగింది.


రష్మిక సోషల్ మీడియాలో తెలియజేస్తూ అందరూ క్షమించాలి గత కొద్దిరోజులుగా మిమ్మల్ని చాలా మిస్ అవుతూ వచ్చాను.. ఎందుకంటే నెట్వర్క్ లేని ప్రాంతంలో షూటింగ్ చేసుకున్నామంటూ రష్మిక సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. అసలు విషయంలోకి వెళ్తే రష్మిక, దేవ్ మోహన్ నటిస్తున్న సరికొత్త చిత్రం రెయిన్ బో.. డ్రీమ్ వారియర్ పిక్చర్ పతాకంపై శాంత రూబన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా తెలుగు తమిళ్ భాషలలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.


సినిమా షూటింగ్ కొన్నాళ్లు నెట్వర్క్ లేని ప్రాంతాలలో జరిగాయని ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా తాజాగా పూర్తయిందని దీంతో నెట్వర్క్ ఉన్న ప్రాంతానికి రావడంతో తనకు సంబంధించిన విషయాలను తెలియజేసింది. రష్మిక చెన్నైలో కొద్ది రోజులు రెయిన్ బో షూటింగ్ చేశాము ఆ తర్వాత కొడైకెనాల్ కి వెళ్ళాము అక్కడ షూటింగ్ పూర్తి అయినది తర్వాతే.. వెళ్లిన మూడో ప్రదేశం మున్నార్.. ఈ రెండు ప్రాంతాలలో అసలు నెట్వర్కు లేదు కానీ కొడైకెనాల్, మున్నార్ లోని అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం చాలా ఉల్లాసంగా అనిపించింది అంటూ తెలియజేసింది రష్మిక. అంతేకాకుండా రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా యానిమల్ అనే చిత్రంలో నటిస్తోంది. టాలీవుడ్ లో నితిన్ సరసన నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: